WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జెఇఒ 'శ్రీనివాసరాజు' అవినీతిపై విచారణ జరిపించాలి

తిరుమల జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజుపై టిటిడి ఉద్యోగులు, టిడిపి స్థానిక నాయకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నియమితులైన శ్రీనివాసరాజుపై సిబీసిఐడితో కానీ సిబీఐతో కాని విచారణ జరిపించాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.10కోట్లు వసూలు చేసి ఒక ప్రముఖ వ్యక్తికి అందజేశారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వారానికి ఐదు రోజులు చెన్నై టు తిరుపతి..తిరుపతి టు హైదరాబాద్‌కు విమానాల్లో విహరిస్తున్నారని లక్ష రూపాయలకు పైగా ఆయన విమాన చార్జీలకు ఖర్చు చేస్తున్నారని ఆయనకు ఇంత సొమ్ము ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలని వారు ఆ ఫిర్యాదులో కోరారు. స్థానిక ఐఎఎస్‌లను ఆ జిల్లాలో నియమించకూడదని నిబంధనలు ఉన్నాయని చిత్తూరు జిల్లా పొత్తూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరాజును టిటిడి జెఇఒగా ఎలా నియమించారని వారు ఆ ఫిర్యాదులో ప్రశ్నించారు.  'రమేష్‌' అనే సూపరింటెండ్‌ దగ్గర రూ.50లక్షలు వసూలు చేశారని అదే విధంగా మధ్యవర్తుల ద్వారా కోట్లాది రూపాయలను ఆయన సంపాదించారని వారి ఫిర్యాదులో ఉంది. 

   స్థానిక వైకాపా నాయకులు కూడా శ్రీనివాసరాజు వ్యవహారశైలిని ప్రశ్నించడం లేదని, ఆయనపై ఇంత వరకు వారు విమర్శలు కానీ, ఆరోపణలు కానీ చేయకపోవడం వెనుక మర్మం ఏమిటని వారు ప్రశ్నిస్తూ వారడిగిన సేవాటిక్కెట్లను, బ్రేక్‌దర్శన టిక్కెట్లు శ్రీనివాసరాజు ఇస్తున్నారని దీనిపై విచారణ జరిపితే రుజవులు చూపుతామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. మాజీ టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి 'శ్రీనివాసరాజు' కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఫామ్‌హౌస్‌ నిర్మించి ఇచ్చారని ఆయన 'శేఖర్‌రెడ్డి'కి బినామీ అని ఆ లేఖలో వారు ఫిర్యాదు చేశారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో ఎకరం మూడు కోట్ల రూపాయల విలువ కలిగిన వంద ఎకరాల భూమిని ఆయన బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక అధికారికి కోట్ల రూపాయల ఖరీదైన గిఫ్ట్‌లను ఆయన ఇస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక మహిళా గాయకురాలితో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆమె తిరుమలకు వచ్చినప్పుడు రాజభోగాలు కల్పిస్తున్నారని ఆవిడ రాకపోకల విమాన ఖర్చులతో పాటు ఆవిడ సిఫార్సు చేసిన వారికి వెంటనే దర్శన టిక్కెట్లు, వసతి కల్పిస్తున్నారని 'బండారు శ్రీకాంత్‌' అనే మధ్యవర్తి ద్వారా ఈ పనులన్నీ శ్రీనివాసరాజు చేయిస్తున్నారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో ఒక్కో అధికారిని నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కదిలించకుండా ఉంచడం వెనుక శ్రీనివాసరాజు ప్రమేయం ఉందని వారందరూ ఆయన బినామీలని వారు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. 'రమేష్‌, రాధాకృష్ణ,శ్రీనివాస్‌నాయక్‌, సాగర్‌ తదితర సూపరింటెండ్‌లు శ్రీనివాసరాజు బినామీలుగా పనిచేస్తూ స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. 

  మూడు సంవత్సరాల్లో లిస్ట్‌-1 దర్శనాలపై విచారణ జరిపితే ఎవరెవరు ఎన్నికోట్లు అక్రమంగా గడించింది తేలిపోతుందని వారు చెబుతున్నారు. అనేక అవకతవకలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు అక్రమంగా గడించిన 'శ్రీనివాసరాజు'ను తిరుమల జెఇఒగా సిఎం ఎలా కొనసాగిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఆయన ఎవరినీ ఖాతరు చేయరని, ముఖ్యమంత్రి కార్యాలయం తన గుప్పెట్లో ఉందని చెబుతుంటారని, దానిపై విచారణ జరిపితే రుజవులు చూపుతామని వారు ఛాలెంజ్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎ.వి.చౌదరి అనేక ఆధారాలతో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటమే కాకుండా దానికి సంబంధించిన కాపీలను సిఎంఒ కార్యాలయ అధికారులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అవినీతి నిరోధకశాఖ డిజిపికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు,మీడియాకు విడుదల చేశారు. 

  తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ విధమైన ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఆరోపిస్తుంటే దీనిపై ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ఇటీవల ప్రధాన మంత్రి మోడీకి, రాష్ట్రపతికి, సీబీఐ అధికారులకు కూడా ఆయన దీనిపై ఫిర్యాదు చేశారు. ఇన్ని అవకతవకలకు పాల్పడుతున్న శ్రీనివాసరాజుపై మీడియా వర్గాలు కూడా అభిమానం చూపుతున్నారనే విమర్శను ఆయన చేస్తున్నారు. తిరుపతి, తిరుమలలో పనిచేసే మీడియా వ్యక్తులు కూడా జెఇఒ శ్రీనివాసరాజు కేటాయించే బ్రేక్‌ దర్శనాలతో సంతృప్తి చెందుతూ ఆయనపై ఈగ వాలకుండా కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా స్థానిక బిజెపి నాయకుడు తిరుమలలో ఏదైనా సంఘటన జరిగితే నానా యాగీ చేసేవారని, కానీ శ్రీనివాసరాజు ఇన్ని అక్రమాలకు పాల్పడుతుంటే ఎందుకు నోరు మెదపడంలేదని, వారిని కూడా శ్రీనివాసరాజు లోబరుచుకున్నారని, దీనిపై కూడా విచారణ జరిపించాలని అధికారపార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

(284)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ