WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సింగర చెరువును పరిశీలించిన వైసిపి నాయకులు

వినుకొండ : సింగర చెరువు నీరు ఎండిపోయినా పాలకులు, అధికారులు పట్టించుకోవటం లేదని వైసిపి నాయకులు అన్నారు. సోమవారం వైసిపి కౌన్సిలర్లు, నాయకులు సింగర చెరువును పరిశీలించిన అనంతరం ప్రసంగించారు. చెరువులో నీరు అడుగంటిందని రానున్న కాలం ప్రజల దాహార్తిని తీర్చటం కష్టసాధ్యమని తెలిపారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు, పాలకుటు పట్టించుకోవటం లేదని ఇప్పటికైనా చెరువును నింపేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా నాయకులు కోరారు. కార్యక్రమంలో వైసిపి కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

(130)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ