WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'యోగి' తప్పేలేదట...!

ఉత్తరప్రదేశ్‌లోని ఘోరఖ్‌పూర్‌ బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో చనిపోయిన చిన్నారుల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 'ఆదిత్యనాథ్‌ యోగి' తప్పేలేదట. పాపం...ఆయన అమాయకుడట. 70మంది చిన్నారుల ఉసురు తీసిన సంఘటనకు ఆయన కారకుడు కాడట...ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం లేదట. ఆయన అమాయకత్వానికి అందరూ మద్దతు ఇవ్వాలట. ఇది బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల మాట. సోషల్‌మీడియాలో 'యోగి'కి మద్దతుగా వారు భారీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి తన ఐటి వింగ్‌ ద్వారా ఈ ప్రచారానికి తెరతీసింది. అయితే ఈ ప్రచారంపై నెట్‌జన్‌లు మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో వారు చేస్తోన్న పోస్టింగ్‌లను చూసి ఇదేదో...'ప్రశాంత్‌ కిషోర్‌'  పెయిడ్‌ ప్రచారంలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. 

  'ట్రూత్‌ ఆఫ్‌ ఘోరఖ్‌పూర్‌' పేరిట ట్విట్టర్‌లో వారు ట్విట్‌తున్న ట్వీట్‌లన్నీ ఒకే విధంగా ఉన్నాయి. కేవలం పేర్లు మార్పు తప్ప మిగతా అంశం మంతా సేమ్‌ టూ సేమ్‌. మొదట ఈవిషయాన్ని 'సమాజ్‌వేద్‌-65' అనే ఖాతా వ్యక్తి గుర్తించారు. తరువాత వరుసగా 'యోగి'ని కీర్తిస్తూ వచ్చిన ట్వీట్లను ఆ వ్యక్తి మరలా రీట్వీట్‌ చేశారు. కొన్ని లక్షల మంది ఇదే విధంగా వ్యవహరించారని నెట్‌జన్‌లు ఆరోపిస్తున్నారు. పెయిడ్‌ వ్యక్తుల ద్వారా ఈ విధమైన ప్రచారాన్ని చేసి అసలు విషయాన్ని బిజెపి పక్కదోవ పట్టిస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవలం 'యోగి'ని సమర్థించడమే కాకుండా గత సంవత్సరం బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో చనిపోయిన వారు ఇప్పటికంటే ఎక్కువ ఉన్నారని గ్రాఫ్‌లు వేసి చూపిస్తున్నారు. చేతకాని తనంతో చిన్నారుల మృతి కారణమడమే కాకుండా అడ్డమైన ప్రచారాలను చేసి తమ అసమర్థతను నిసిగ్గు సమర్థించుకుంటున్న బిజెపి నేతలను చూసి జాతియావత్తూ సిగ్గుపడుతోంది.


(129)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ