WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వెంకయ్య'కు నాల్గవ స్థానం...!

ఇండియాటుడే-కార్వే నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో 'మోడీ' మంత్రివర్గంలో ఉత్యుత్తమంగా పనిచేస్తున్న వారిలో మొన్నటి దాకా సమాచారశాఖ నిర్వహించిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు నాల్గవ ర్యాంక్‌ లభించింది. మంత్రుల పనితీరు ఆధారంగా ప్రజల అభిప్రాయాన్ని ఈ సర్వే వెల్లడించింది. 28శాతంతో ఆర్థికశాఖ మంత్రి 'అరుణ్‌జైట్లీ' మొదటి స్థానం సాధించగా, 26శాతంతో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండవ స్థానంలోనూ, 21శాతంతో విదేశీవ్యవహారాలశాఖ మంత్రి 'సుష్మాస్వరాజ్‌' మూడవ స్థానంలో ఉండగా, 16శాతంతో 'వెంకయ్యనాయుడు' నాల్గవ స్థానంలో ఉన్నారు. టాప్‌ఫైవ్‌లో 'వెంకయ్యనాయుడు' స్థానం సాధించడం ఆయన పనితీరుకు అద్దం పడుతోంది. ఆయన తరువాత నితిన్‌ఖడ్కరీ, సురేష్‌ప్రభువులు ఉన్నారు.

  కాగా 'మోడీ' పనితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు దాదాపు 24శాతం మంది ఆయన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భయపడరని చెప్పారు. 23శాతం మంది ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు..కాని పనిచేయరని అభిప్రాయపడ్డారు. 15శాతం మంది ఆయన పేదల పక్షపాతని  పేర్కొన్నారు. 12శాతం మంది ఆయన లౌకికవాదని పేర్కొనగా అంతే శాతం మంది ఆయనను యాంటీ మైనార్టీ అని కూడా చెప్పారు. 10శాతం మంది ఆయన సబ్‌కా సాథ్‌...సబ్‌కా వికాస్‌కు కట్టుబడి ఉన్నారని పేర్కొనగా...6శాతం మంది ఆయన ధనికుల కొమ్ము కాస్తున్నారని అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద అచీవ్‌మెంట్‌ ఏదని ప్రశ్నించగా 23శాతం మంది బ్లాక్‌మనీని అరికట్టడమని పేర్కొనగా...14శాతం మంది అవినీతి రహిత ప్రభుత్వమని చెప్పారు. మరో 14శాతం మంది పెద్దనోట్ల రద్దు చేయడమని అన్నారు.


(179)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ