WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రానున్నది జగన్న రాజ్యం : వైసిపి నాయకులు విజయచందర్‌

వినుకొండ : టిడిపి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, రానున్నది జగన్న రాజ్యమని వైసిపి ప్రచార కార్యకర్త విజయచందర్‌  అన్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు వైసిపి నవరత్నాల సభ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యమానికి వినుకొండ కన్వీనర్‌ బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలు భాధాకరమని జన్మభూమి కమిటీలో ప్రజలకున్యాయం జరగటం లేదని, కేవలం టిడిపి పార్టీ నాయకులకే ప్రభుత్వ  పధకాలు అందుతున్నాయని, ఎపి వ్యవసాయంతో ముందుకు సాగాల్సి ఉండగా ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పొన్నూరు ఇన్‌చార్జ్‌ రావివెంకట రమణ, పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్‌ కావటి మనోహర్‌నాయుడు, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, మైనారిటి సెల్‌ నాయకులు సయ్యద్‌ మాబు, తదితరులు పాల్గొన్నారు.

నంద్యాలలో గెలుపు వైసిపిదే : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వినుకొండ : నంద్యాలలో గెలుపు వైసిపిదే నని వైసిపి ఎం.ఎల్‌.సి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాలలో ప్రచారం ముగించుకొని గుంటూరుకు వెళ్తూ మార్గమద్యమైన వినుకొండలో ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో చేసిన అభివృద్ది శూన్యమన్నారు. నంద్యాల ఎన్నికలలో టిడిపి చేపడుతున్న ప్రలోభాలను ప్రజలు నమ్మరని మరోసారి వైసిపి గెలుపు ఖాయమన్నారు. సంక్షేమ పధకాలను టిడిపి పార్టీ శ్రేణుల కోసమే ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కిలారి వెంకట రోశయ్య, టంకసాల శ్రీనివాసరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.


(53)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ