WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

యువకుడి ఆత్మహత్య

వినుకొండ : అనారోగ్య కారణాల వలన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని లాయర్‌ స్ట్రీట్‌లోని ప్రిన్స్‌ హెయిర్‌ స్టైయిల్‌ నందు పనిచేస్తున్న 21 సంవత్సరాల రాయవరం అజయ్‌ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి షాపు యజమాని అంజి ఊరికి వెళ్తూ తాళం చేతులు అజయ్‌కు ఇచ్చివెళ్ళాడు. ఈ నేపద్యంలో శుక్రవారం రాత్రి అజయ్‌ ఇంటికి వెళ్ళకుండా షాపులోనే ఉండి షెట్టర్‌ వేసుకొని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం తెల్లవారుజామున షాపు యజమాని షెట్టర్‌ తీసి చూడగా అజయ్‌ ఉరి వేసుకొని ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అజయ్‌ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపర్లను కలిచివేసింది.

(286)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ