WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బదిలీ పై వెళ్తున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు సభ

వినుకొండ : వినుకొండ పట్టణంలోని 15వ వార్డు నందు గల మండల ప్రాధమిక పాఠశాల నందు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డి. సంగీతరావు, ఎం. వెంకటేశ్వర్లు, బి. పెదవీరయ్య బదిలీ కావటంతో వీడ్కోలు సభను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంఈవో సయ్యద్‌ జఫ్రూల్లా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్దికి ఉపాధ్యాయులు చేసిన అభివృద్ది అభినందనీయం అన్నారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎ. రామలింగేశ్వరరావు, కె.ధనలక్ష్మీ, ఉపాధ్యాయులు డి.వి. లింగయ్య, జి.సిహెచ్‌.  యర్రయ్య, జె. భార్గవి, టి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

(95)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ