WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఘనంగా ప్రపంచ ఫోటగ్రఫీ దినోత్సవ వేడుకలు

వినుకొండ : నియోజకవర్గ ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం 178వ ప్రపంచ ఫోటగ్రఫి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి గ్రామంలోని బదీరుల పాఠశాల నందు విద్యార్దుల సమక్ష:లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు యార్లగడ్డ లెనిన్‌ కేక్‌ను కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరిగే కాలములో చెదరని మధురస్ముతులకు ప్రతిబింబాలు ఫోటోలు అని, ప్రతి ముఖ్య సన్నివేశాన్ని  కెమెరాలో బంధించి జీవితకాలం వాటిని పదిలంగా దాచుకొని అలనాటి ఙ్ఞాపకాలను, మళ్ళిమళ్ళి తనివితీరా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇంతటి తీయ్యని మదుర ఙ్ఞాపకాలు ఒక్క ఫోటోగ్రఫీ ద్వారా అందుతుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

(138)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ