WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వినేవాడు...వెర్రిగొర్రె అయితే..చెప్పేవాడు...కెసిఆర్‌...అవుతాడు...!

'వినేవాడు...వెర్రిగొర్రె అయితే...చెప్పేవాడు....కెసిఆర్‌' అవుతాడు...! ఆ మధ్య ఏమన్నాడూ...! తెలంగాణలో కులతత్వమే లేదూ...! ఇది ఆంధ్రాలోనే ఎక్కువ...అక్కడే కులాల పేరుతో కొట్టుకు ఛస్తారూ...! తమది కులతత్వం లేని అభ్యుదయ సమాజం...ఇంకేమిటో...! కీర్తికిరీటాలు తగిలించుకున్నాడు కదా...! విలేకరుల సమావేశంలో గంటల కొద్ది సుత్తి కొట్టారు కదా...! మరి నిన్నేం చేశావ్‌ కెసిఆర్‌...! తెలంగాణలో తనకు బలమైన పోటీదారు అవుతారని భావించిన 'రెడ్డి' సామాజికవర్గాన్ని ఎందుకు బుజ్జగిస్తున్నావ్‌...! 'రెడ్డి' పేరుతో పోలీస్‌ అకాడమీ పేరును ఎందుకు మార్చావ్‌...? 'రెడ్డి'లకు తనకు వ్యతిరేకత ఉందనా...? 'రెడ్డి' సంక్షేమ సంఘం హాస్టల్‌కు భూమి, పదికోట్లు నిధులు ఎందుకు కేటాయించావ్‌...? నీ రాష్ట్రం అభ్యుదయ రాష్ట్రం కదా..? నీ బంగారు పాలనో అన్ని కులాల వాళ్లు బంగారు పల్లకీల్లో ఊరేగుతుంటే...కేవలం 'రెడ్డి'లనే ఎందుకు బుజ్జగిస్తున్నావ్‌...కెసిఆర్‌...! రాబోయే ఎన్నికల్లో 'రెడ్డి'లు నీకు దూరమవుతారనే కదా...? 

  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి 'నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి' ఇచ్చిన జీవోనే మళ్లీ  ఎందుకు ఇచ్చావ్‌...? తెలంగాణ పోలీస్‌ అకాడమీ పేరును 'రాజా బహుద్దూర్‌ వెంకట్రామారెడ్డి' అకాడమీగా ఎప్పుడో మారిస్తే...ఇప్పుడు మళ్లీ అదే పేరుతో జీవో ఇచ్చి...'రెడ్ల'ను తన పక్కలో కూర్చోబెట్టుకోవాలనే తపనెందుకు...? ఈ తంతంగానికి కోట్లు కేటాయించి పత్రికల్లో మొదటి పేజీల్లో యాడ్‌లు ఇవ్వడమెందుకు...?'రెడ్డి' హాస్టల్‌ శతాబ్ది ఉత్సవాలకు హాజరై తాను వారికి వ్యతిరేకంగా కాదని చెప్పుకోవడమెందుకు..? ఒక వైపు నీ 'గొర్రెబ్యాచ్‌'తో 'రెడ్డి' వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడమెందుకు...? మళ్లీ నువ్వొచ్చి బుజ్జగించే పనులెందుకు...? మరో వైపు నీ హోంమంత్రి జేఎసి నాయకుడు 'కోదండరామిరెడ్డి' అసలు రెడ్డే కాదు...ఆయన కల్తీ రెడ్డి అని అనడమెందుకు...? ఒకవైపు గిచ్చేదీనీవే...మరోవైపు బుజ్జగించేదీ నీవే...! మరి ఇంత దానికి...తెలంగాణలో కులాల కుంపటి లేదు..అది ఆంధ్రాలోనే ఉందని పస తక్కువ మాటలు మాట్లాడమెందుకు...? కేవలం 'రెడ్డి' సామాజికవర్గానికే కాదు...తెలంగాణలో ఇంతకముందు లేని విధంగా ప్రతి కులానికి కార్పొరేషన్లు పెట్టి కులాల కుంపటి రగిలించాలని చూస్తుందీ కెసిఆరే...! ఇప్పటికే వివిధ కుల సంఘాలకు కార్పొరేషన్లు, సంక్షేమభవన్లు నిర్మించి కులాల ఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్లానేసిన మీరు...ఇతర రాష్ట్రాల్లోని విషయాల గురించి మాట్లాడమెందుకు...? మీ పని మీరు చూసుకుంటే పోతుంది కదా...! ఏమంటరూ...!


(475)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ