WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చిల్లర సమస్య తీర్చడానికే రూ.200నోట్‌...!

గత నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో ఏర్పడిన గందరగోళం ఇంకా సద్దుమనగక ముందే కేంద్రం కరెన్సీపై మరో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే నూతనంగా రెండు వందల రూపాయల నోట్‌ను ప్రవేశపెట్టడం. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000/- నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో నూతనంగా ఐదువందల నోట్‌, రెండు వేల రూపాయల నోట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ నోట్ల ముద్రణ ఆలస్యం కావడంతో ప్రజలు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రజల సమస్యలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం కరెన్సీతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం కూడా నోట్లతో ఈ రకమైన ప్రయోగాలు చేయలేదు. 'మోడీ' ప్రభుత్వం వివిధ కారణాలను చూపుతూ కరెన్సీతో ఆడుకుంటూనే ఉంది. తాజాగా రేపటి నుంచి రెండు వందల రూపాయల నోట్‌ను విడుదల చేయబోతోంది. దానికి ప్రభుత్వం చెబుతున్న కారణం...రెండు వేల రూపాయల నోట్‌కు చిల్లర వెతుక్కోవడం సమస్యగా మారిందని, అందుకే నూతనంగా ఈ నోట్‌ను ప్రవేశపెట్టినట్లు వివరిస్తోంది. ఇప్పటికే రూ.500నోట్‌, రెండువేల రూపాయల నోట్‌, వంద రూపాయల నోట్లుమాత్రమే పెద్ద నోట్లుగా చలామణిలో ఉన్నాయి. వీటితో చిల్లర సమస్య ఎదురు కావడంతో రెండు వందల రూపాయల నోట్‌ను ప్రవేశపెట్టి ప్రజల ఇబ్బందులు తీర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నూతనంగా వచ్చే ఈ నోట్‌ను 'మిస్సింగ్‌ మిడిల్‌'గా బ్యాంక్‌ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

(289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ