ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంఫియన్ షిప్ ఫైనల్ తెలుగుతేజం 'సింధు'కు అపజయం ఎదురైంది. భారత్ నెంబర్‌వన్ బ్యాట్మింటన్ ప్లేయర్ 'సింధు' జపాన్‌కు చెందిన 'నొజోమి ఒకురా'తో జరిగిన ఫైనల్లో 19-21,22-20,20-22 తేడాతో ఓడిపోయింది. ఆదివారం నాడు ఇంగ్లాండ్‌లోని గ్లాస్కోలో జరిగిన ఈ ఫైనల్లో ఈ జంట హోరాహోరిగా పోరాడింది. ఆదివారం ఉదయం సెమీఫైనల్లో గెలిచిన 'సింధు' మరో 17గంటల్లోనే ఫైనల్లో 'నొజోమీ'తో పోరాడాల్సి వచ్చింది. అయితే ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్ పోరులో తమ సత్తా చూపించారు. సుధీర్ఘర్యాలీలతో పాటు పవర్గేమ్నూ చూపించారు.
హోరాహోరిగా సాగిన పోరులో మొదటి గేమ్ 19-21తో 'నొజోమి' గెల్చుకుంది. అయితే మొదటి గేమ్‌ను 'సింధు' ఆధిక్యంతోనే ఆరంభించింది. ఒకుహరా ఫైన్‌లైన్ జడ్జిమెంట్‌తో తొలిపాయింట్ సాధించింది. తరువాత 'సింధు' వరుసగా రెండు పాయింట్లు సాధించి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నించగా 11-5తో 'సింధు' బ్రేక్‌కు వెళ్లింది. బ్రేక్ తరువాత 'ఒకుహరా' వరుసగా రెండు పాయింట్లు సాధించి 'సింధు' ఆధిక్యాన్ని 7-11కు తగ్గించింది. తరువాత కూడా 'ఒకుహరా' తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. 39 షార్ట్ ర్యాలీలతో సాగిన పాయింట్‌తో 10-13తో సింధు నిలిచింది. అనంతరం 14-14తో 'ఒకుహరా' కీలకమైన పాయింట్లు సాధించి 'సింధు' ఆధిక్యాన్ని తగ్గించి వరుసగా నాలుగుపాయింట్లు అదే ఊపులో సాధించి 18-14 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో 'సింధు' ఒత్తిడికి గురయింది. అయినా పట్టువదలని 'సింధు' 'ఒకుహరా' ఛేజ్‌చేసి 18-18గా నిలిచింది. తరువాత 19-19తో ఇరువురు సమాన స్థితిలో ఉన్నారు. కీలకమైన గేమ్‌పాయింట్ సమయంలో 'సింధు' కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో 19-21తో తొలి గేమ్ 'నొజోమి' వశమైంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న 'సింధు' 22-20తో 'నొజోమి'పై పై చేయిసాధించింది.
ఈ గేమ్‌లో 'సింధు' ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మొదటిలోనే 5-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పట్టువదలని 'ఒకుహరా' ఐదు వరుస పాయింట్లు సాధించి 'సింధు'ను సమీపించింది. దీంతో ఇద్దరి మధ్య నువ్వా...నేనా అన్నట్లు పోరు సాగింది. ఒక దశలో 'ఒకుహరా' (13-12) ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ గేమ్‌లో కూడా 'సింధు'కు ఓటమి తప్పదేమో అనిపించింది. అయితే గట్టిగా పోరాడిన 'సింధు' నాలుగు వరుస పాయింట్లతో 16-13కు ఆధిక్యాన్ని పెంచుకుంది. అయినా 'నొజోమి' తలవంచకుండా 'సింధు'ను వెంటాడింది. అయితే ఆమె చేసిన తప్పుల వల్ల 'సింధు' 19-17 ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. అయినా ఆగని 'ఒకుహరా' మ్యాచ్‌ను 20-20గా మార్చింది. అయితే మరో రెండు కీలకమైన పాయింట్లు వరుసగా సాధించిన 'సింధు' చివరి సెట్‌కు దారి తీసేలా చేసింది. కీలకమైన మూడో గేమ్‌లో 'సింధు' గట్టిగా ప్రతిఘటించినా లాభం లేకపోయింది. చివరకు 20-22తో మూడో గేమ్ గెల్చిన 'నొజోమి' స్వర్ణం ఎగురేసుకుపోయింది. కాగా 'సింధు'కు ప్రపంచ బ్యాట్మింటన్ ఫైనల్లో ఆడడం ఇదే తొలిసారి. గతంలో ఆమె 2013, 2014లో సిల్వర్ పతకం గెల్చింది. అయితే ఈ సారిఫైనల్కు చేరిన ఆమె తప్పకుండా స్వర్ణం సాధిస్తుందని అభిమానులు భావించారు. కానీ 'నొజోమి' అద్భుతంగా ఆడడంతో 'సింధు' కల నెరవేరలేదు. ప్రపంచ బ్యాట్మింటన్‌లో భారత్ వరుసగా రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ