'మోడీ' పాలనలో మూడేళ్లు వెనక్కి...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ' పాలనలో మూడేళ్లు వెనక్కి...!

దేశ ప్రజలంతా ఎంతో ఆశతో ఓట్లేసి గెలిపించిన 'మోడీ' పాలనపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని, సగటు ప్రజల కష్టాలను తీరుస్తారని భావించిన ప్రజల ఆశలపై ఆయన నీళ్లు కుమ్మరించారు. ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశాభివృద్ధి కుంటుబడిందని సెంట్రల్‌ స్టాటిక్స్‌ ఆఫీస్‌(సిఎస్‌ఒ) తెలిపింది. దేశ స్థూలజాతీయోత్పత్తిలో మూడు సంవత్సరాల కనిష్టస్థాయికి వృద్ధిరేటు చేరిందని తేలింది. జూన్‌ త్రైమాసికానికి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ క్వార్టర్‌లో కేవలం 5.7శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. 2014 జనవరి- మార్చి త్రైమాసికంలో ఇటువంటి వృద్ధిరేటు నమోదు కాగా ఇప్పుడు మరోసారి అటువంటి వృద్ధిరేటు నమోదు అయింది. ఆర్థికవేత్తలు 6.6శాతం వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేయగా వారి అంచనాలన్నీ తలకిందలయ్యాయి. గత త్రైమాసికంలో 6.1శాతం వృద్ధిరేటు సాధించగా దాన్ని ఈ త్రైమాసికం దాటుతుందని వారు అంచనాలు వేశారు. అయితే అనూహ్యంగా మూడేళ్ల కనిష్టస్థాయి వృద్ధిరేటు పడిపోయి వారిని దిగ్బ్రాంతికి గురిచేసింది.

నోట్లరద్దు ప్రభావం...!

గత నవంబర్‌8న ప్రధాని మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు వల్ల కలిగిన ప్రభావం ఇంకా ఆర్థికరంగంపై కొనసాగుతోంది. తాజాగా రిజర్వ్‌బ్యాంక్‌ గతంలో రద్దుచేసిన నోట్లలో దాదాపు 99శాతం వెనక్కు వచ్చాయని తేల్చి చెప్పింది. నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటపడుతుందని భావించగా అటువంటి అవకాశాలే కనిపించలేదు. సరికదా...నోట్ల రద్దుప్రభావం పలురంగాలపై పడడంతో దేశ వృద్ధిరేటు మందగమనంలోకి వెళ్లిపోయింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విరుచుకుపడుతోంది. నోట్లరద్దు వ్యవహారంపై ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది...అంతే కాకుండా ఇదో పెద్ద స్కామ్‌ అంటూ విమర్శలు గుప్పిస్తోంది. నోట్లరద్దు వల్ల దాదాపు 2.25లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారికి దోచి పెట్టడం కోసం ఈ వ్యవహారాన్ని నడిపించారని వారు ఆరోపిస్తున్నారు.

జిఎస్‌డి కూడా కారణమే...!

దేశ వృద్ధిరేటు తగ్గిపోవడానికి ఇటీవల ప్రవేశపెట్టిన గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌ కూడా ఒక కారణమని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.  చీఫ్‌ స్టాటిక్స్‌ ఆఫ్‌ ఇండియా 'అనంత్‌' మాట్లాడుతూ జిఎస్‌టి వల్ల వ్యాపారస్తులు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారని దీని వల్ల వృద్ధిరేటు మందగించడానికి కారమని ఆయన అన్నారు.


(329)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ