లేటెస్ట్

‘యనమల’ కుటుంబానికి సీటు ఇస్తే..నాకు మళ్లీ హ్యాట్రికే:రాజా

తాను మళ్లీ జగన్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తాననంటున్నారు తుని ఎమ్మెల్యే. మీ గెలుపుపై ధీమాకు కారణం ఏమిటని మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేను ప్రశ్నస్తే ఇక్కడ టిడిపి బలంగానే ఉంది. అభ్యర్థి ఎంపికే తనకు వరంగా మారిందంటున్నారు ఆయన. ఈ నియోజకవర్గం నుంచి ఆ కుటుంబం మినహా మరెవరికైనా పోటీ చేసే అవకాశం చంద్రబాబు కల్పిస్తే తన గెలుపుపై తనకే నమ్మకం లేదంటున్నారు ఎమ్మెల్యే. ఇక అసలు విషయానికి వస్తే 2009లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, 2014, 2019ల్లో ‘జగన్‌’ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మళ్లీ మూడవ సారి కూడా తాను విజయం సాధించగలుగుతానని స్థానిక ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారంటే...టిడిపి అభ్యర్థి ఎంపికే కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి విజయం సాధించాలంటే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గాని ఆయన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి గానీ పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా స్థానిక బీసీ అభ్యర్థిని కానీ, లేదా మరో సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు ఎంపిక చేయగలిగితే, తాజా పరిస్థితి తారుమారు అవడం ఖాయమంటున్నారు స్థానిక నేతలు. అసలు విషయానికి వస్తే 1983 నుండి 2004 వరకు తుని నియోజకవర్గం నుంచి 6సార్లు వరుసగా విజయం సాధించి, డబల్‌ హ్యాట్రిక్‌ సాధించిన మాజీ మంత్రి యనమల 2009లో ఓడిపోగా, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు 2014,2019ల్లో ఘోరంగా ఓడిపోయారు.


మాజీ మంత్రి యనమల సోదరుడు కృష్ణుడిని నియంతృత్వ వైఖరి వల్లే అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికంగా చెలరేగిపోవడమే మెజార్టీ ఓటర్లు పార్టీకి వ్యతిరేకం అయ్యారని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసనని స్థానిక నేతలు అంటున్నారు. డబల్‌ హ్యాట్రిక్‌ సాధించిన చోట హ్యాట్రిక్‌ ఓటమికి ముఖ్యకారకుడు యనమలకృష్ణుడే అని స్థానిక నేతలు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. యనమల కుటుంబానికి తుని నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దు..మీ ఇష్టం వచ్చిన వారిని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయండి. పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా విజయం సాధిస్తారని స్థానిక నేతలు ‘చంద్రబాబు’తో మొరపెట్టుకున్నా మాజీ మంత్రి యనమలను నొప్పించడం ఇష్టం లేక ఆయన సిఫార్సు మేరకు పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసి చంద్రబాబు చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని బాహాటంగా యనమల చెబుతున్నప్పటికీ పరోక్షంగా తన సోదరుడే పార్టీ అభ్యర్థి అవుతారని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా యనమల కుటుంబాన్ని తుని నియోజకవర్గం నుంచి దూరం పెడితేనే మళ్లీ అక్కడ టిడిపి జెండా ఎగురుతుంది తప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసినంత కాలం ప్రత్యర్థులు కాలు మీద కాలు వేసుకుని విజయం సాధిస్తారని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ