WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నగరంలో సిటీ బస్సులను ఆదరించండి:శ్రీహరి

ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన సిటీ బస్సులను ప్రజలు ఆదరించాలని సంస్థ లాభాలబాటలో నడవాలన్నా, ప్రజలకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు యధావిధిగా కొనసాగాలన్నా ప్రజలు ఆదరించాలని గుంటూరు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీహరి విజ్ఞప్తి చేశారు. 'జనం ప్రత్యేక ప్రతినిధి'తో ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా గుంటూరులో మరికొన్ని సర్వీసులను అదనంగా పెంచుతామన్నారు. నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టామని, ప్రయాణీకులు ఆయా పాస్‌లను తీసుకోవచ్చన్నారు. ఒక రోజు పూర్తిగా గుంటూరు నగరంలో ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా ఎన్నిసార్లైనా ప్రయాణించేందుకు ఒక రోజు పాస్‌ను అమలు చేస్తున్నామన్నారు. సిటీ బస్సులు సమయానుకూలంగా నడవడం లేదని, ప్రయాణీకుల ఫిర్యాదుపై ఆయన స్పందించి మళ్లీ తన దాకా రావద్దని ఆయన అధికారులను ఆదేశించారు. తాను ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్నానని ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాలను స్వయంగా తిరిగి వచ్చానని తాను ఎంతో మంది ప్రయాణీకులతో స్వయంగా మాట్లాడడం జరిగిందని వారు చేసే ఫిర్యాదులపై స్పందించి వెంటనే చర్యలు కూడా తీసుకున్నానని శ్రీహరి చెప్పారు. 

 గుంటూరు జిల్లా ఆర్టీసీ ఆదర్శంగా ఉండాలని, మిగతా జిల్లాల ఆర్టీసీలతో పోటీపడే విధంగా వ్యవస్థలో పోటీపడాలని చెప్పారు. చిన్న చిన్న తప్పులకు, పొరపాట్లకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వస్తోన్న విమర్శలను ఆయన ఖండించారు. నిబంధనల ప్రకారం ఒకటీ రెండు విషయాల్లో తప్ప మిగతా విషయాలపై పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆటోలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్న విషయం తాను గమనించానని, వారి ఇబ్బందులకు చలించిపోయి ఉన్నతాదికారులకు ఫోన్‌ చేసి వారిని ఒప్పించి గుంటూరు నగరంలో సిటీ సర్వీసులను ప్రవేశపెట్టామని తెలిపారు. ఇప్పటికైనా వివిధ ప్రాంతాల నుండి గుంటూరు నగరానికివచ్చే ప్రయాణీకులు, గుంటూరు నగర పౌరులకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రశాంతంగా ప్రయాణించాలని ఆర్టీసీ సంస్థ ప్రజాసంస్థే తప్ప వ్యాపారసంస్థ కాదన్నారు.

(153)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ