లేటెస్ట్

ప్రభుత్వం మాదే..అధికారం మాదే..!

వివాదాస్పద విమర్శలు, ఆరోపణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంలో ఆ అధికార ఎమ్మెల్యే అపార అనుభవం ఎంత ఉందో పక్కన పెడితే తాజాగా దళిత మాజీ ఎమ్మెల్యే ఆ అధికార ఎమ్మెల్యే మళ్లీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లపైఅభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అధికార ఎమ్మెల్యే దళిత మాజీ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అందుకు మూల్యం చెల్లించుకోబోతున్నారు. ప్రభుత్వం మాదే..అధికారం మాదే..మా మంత్రులు, ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తే ఊరుకోం..మీరెంత మీ బ్రతుకు ఎంత..? అంటూ అధికార ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నెల్లూరు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అనితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.


ఒక దళిత మాజీ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నీ అంతు చూస్తాం..తస్మాత్‌ జాగ్రత్త అని ఆ ఎమ్మెల్యే బెదిరించడాన్ని రాజకీయపార్టీనేతలు తప్పుపడుతున్నారు. టిటిడి మాజీ ఎమ్మెల్యే అనిత కొంత మంది మంత్రులు, అధికార ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో పలు విమర్శలు చేశారు తప్ప..వారిపై ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసలు విషయం తెలుసుకోకుండా అధికారపార్టీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాజీ దళిత ఎమ్మెల్యేపై నోరు పారేసుకున్నారు. ఇంతకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఏమి ఆశిస్తున్నారు..? అటు చంద్రబాబు, ఇటు లోకేష్‌లపై కాకుండా ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు, ఆరోపణలు చేస్తే, బాహాటంగా బయటపడి నోటికి వచ్చినట్లు మాట్లాడి అప్రదిష్టపాలవుతున్నారు. మంత్రి పదవి కోసమే ప్రసన్న ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని నెల్లూరు టిడిపి నేతలు అనేక సందర్భాల్లో దుయ్యబట్టారు. తనపై అధికార ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ దళిత ఎమ్మెల్యే అనిత ముందు ముందు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ