WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్...!

అంతర్గత ఎన్నికల ద్వారా రాహుల్‌ వచ్చే నెలలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తెలిపారు. పార్టీ కోరితే కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల రాహుల్‌ బహిరంగంగానే చెప్పారు. దీంతో పార్టీ బాధ్యతలు రాహుల్‌కే అని వూహగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ‘ఆయన(రాహుల్‌) వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టాలి. అప్పుడే పార్టీకి, దేశానికి మంచిది. రాహుల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇప్పటికే ఆలస్యమైందని పార్టీలో ప్రతి ఒక్కరు భావిస్తున్నారు’ అని మొయిలీ అన్నారు. అయితే వచ్చే నెలలో రాహుల్‌ పార్టీ బాధ్యతలు చేపడతారా? అని ప్రశ్నించగా.. ‘అవును చేపట్టే అవకాశం ఉంది’ అని సమాధానమిచ్చారు.‘ఈ విషయంపై అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. రాహుల్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. కాంగ్రెస్‌ మరింత పటిష్ఠంగా మారుతుంది’ అని వీరప్ప మొయిలీ అన్నారు. సోనియాగాంధీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు చేపట్టేదెవరు అనే దానిపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది

(175)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ