WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణాలో చీర‌ల మంట‌లు...!

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణి ఫై తీవ్ర నిరసన వ్యక్తం మవుతుంది. గద్వాల చీరల పంపిణీ అని టీవీ ఛానెళ్లలో ప్రకటించి, తీరా పంపిణీకి వచ్చేసరికి తమకు 100 రూపాయల చీరలు అంటగడుతున్నారని జనగామ, భువనగిరి, జగిత్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల మహిళలు మండిపడ్డారు. ఈ 100 రూపాయల చీరల కోసం 300 రూపాయల కూలీ పనులు మానుకుని వచ్చామని ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రమైన భువనగిరిలోనూ బతుకమ్మ చీరెల పంపిణీ అస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ చీరెలపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద రూపాయల చవకబారు చీరెలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. రోడ్డుపై చీరలు వేసి బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. కొందరు మహిళలు చీరలను తగులబెట్టి నిరసన తెలిపారు.అటు జగిత్యాలలోనూ చీరల పంపిణీ వివాదాస్పదమైంది. రూ. 50చీరలు ఇస్తున్నారంటూ మహిళలు మండిపడ్డారు. రోడ్డుపై చీరలను తగులబెట్టారు. టీవీల్లో చూపించిన చీరలు వేరనిపంపిణీ చేస్తున్న చీరలు వేరని మహిళలు మండిపడ్డారు. నేత చీరలు ఇస్తామని చెప్పిఇప్పుడు నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారనిప్రభుత్వం సంతోషంగా ఇస్తుందని ఆశపడ్డామనిఇలాంటి చీరలు తాము కొనుక్కోగలమని మహిళలు అన్నారు. ఇలాంటి చీరలు కట్టుకుని తాము బతుకమ్మ ఆడలేమనికవితక్కకు ఇలాంటి చీరలే ఇస్తున్నారాఈ చీరలు కట్టుకుని ఆమె బతుకమ్మ ఆడుతుందాఅని ఓ మహిళ ప్రశ్నించింది. ఈ చీరలు ఇళ్లు తుడుచుకోడానికి కూడా పనికిరావని నేత చీరలు ఇస్తామని చెప్పినాసికరం సిల్కు చీరలు ఇస్తున్నారని తమను అవమానించారని జగిత్యాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  కాగా భద్రాచలంలో చీరల పంపిణీలో నాసిరకం చీరలను పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ భద్రాచలంలోని శిల్పినగర్‌ కాలనీకి చెందిన పలువురు మహిళలు తాము తీసుకున్న చీరలను తగలబెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ సంబురాలకు చేనేత చీరలను ఇస్తామని చెప్పి చివరకు నాసిరకంగా ఉన్న చీరలను అందజేస్తున్నారని వారు ఆరోపించారు. మేము రూ300కూలీ వదులుకొని క్యూలైన్లో ఉంటే రూ.50 చీర ఇచ్చారుదీని బదులు ఏ పప్పోఉప్పో ఇస్తే కడుపు నిండా ఒక పూట తినేవాళ్లము కదా అని పేర్కొన్నారు. మేము ఏమైనా అడుక్కునే వాళ్లమామేము చీరలు ఇవ్వమని అడిగామాపండుగల పేరుతో కోట్లకు కోట్లు ప్రజా ధనం దుర్వినియోగం చేయడం దారుణమని పేర్కొన్నారు. మేము రూ.50 చీర కోసం వెళ్తే రూ.300కూలీ పోయిందని అన్నారు. మాకో చీర ఇచ్చారు ఏం సుఖంపనికిరాని చీరలు ఇచ్చి మహిళలను అవమానించడం మంచి పద్దతి కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బలా చీరల పంపిణీ తయారైందనిబతుకమ్మ పండుగ పేరుతో నాసిరకం చీరలను అందజేయడం సమంజసం కాదని వారు స్పష్టం చేశారు. జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. నాసిరకం చీరలు ఇస్తున్నారని మహిళల ఆందోళన నిర్వహించారు. బతుకమ్మ చీరలు దహనం చేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.గద్వాల చీరలని వంద రూపాయల చీరలు అంటగడతారా?ఈ చీరలు కట్టుకుని కవితబతుకమ్మఆడుతదా, కేసీఆర్ సారూ?పేదలంటేచులకనా?అంటూపలువురుమహిళలు ప్రశ్నించారు.వంద రూపాయల చీర కోసం 300 కూలి వదిలిపెట్టి వచ్చినం రోడ్డుపై బతుకమ్మ పంపిణీ చీరలను మహిళలు తగులబెట్టారు.బతుకమ్మ ఉత్సవాల్లో ఈ చీరలు కట్టుకుని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత బతుకమ్మ ఆడతదా? అని పలువురు మహిళలు ప్రశ్నించారు. పేద మహిళలంటే అంత చులకనా, కేసీఆర్ సారూ? అని వారు నిలదీశారు. 60-70 రూపాయలకు వచ్చే చీరలను ఎవరైనా పండుగపూట కట్టుకుంటరా? అని వారు మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను రోడ్డుపై వేసి తగులబెట్టి, తమ నిరసన తెలిపారు. నాసిరకం చీరలు ఇస్తూ మహిళలను కేసీఆర్ అవమానిస్తున్నారని కాంగ్రెస్ మహిళానేత నేరెళ్ల శారద అన్నారు. 

  మహిళల ఓట్ల కోసం చీప్ ట్రిక్స్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం లేదు.. కానీ.. మద్యం షాపుల సమయం పెంచారని ఆమె మండిపడ్డారు.బతుకమ్మ పండగ పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీలో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌లో చీరల పంపిణీలో కొందరు మహిళలు ఘర్షణకు దిగారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ ఒక్కరే ఉండడంతో ఘర్షణను అడ్డుకోలేకపోయారు. సుమారు పది నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడ్డారు.మహిళల ఘర్షణ పడుతుండడంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. సైదాబాద్‌ శిశుమందిర్‌లో పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీరల పంపిణీకి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వినవస్తున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాయడం మూలానే వివాదం తలెత్తింది.

(244)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ