WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

తమిళనాడు రాజకీయాల్లో టీటీవీ దినకరన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించారని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ ధన్‌పాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 24న స్పీకర్‌ వీరికి షోకాజు నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి పళనిస్వామిని గద్దెదించుతానని గత కొంతకాలంగా దినకరన్‌ వరుస ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. పళనిస్వామికి బలం లేదని.. బలనిరూపణకు ఆదేశించాలని దినకరన్‌ వర్గం ఇటీవల మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించింది. విపక్షాలు కూడా ఇదే విషయమై పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దినకరన్‌ మద్దతు వర్గంపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే శశికళను ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో తమిళనాడు అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 234 నుంచి 215(ఖాళీగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్‌ను కలుపుకొని)కు చేరింది. దీంతో పళనిస్వామికి అసెంబ్లీలో బల నిరూపణకు 107 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది.

(324)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ