WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పుడు దెయ్యాలు కూడా ఫింఛ‌న్లు తీసుకున్నాయి...!

ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోవాలన్నదే తన ఆకాంక్ష అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా చోటు సంపాదించాలనే ఉద్దేశంతోనే తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు.  అందుకే ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు  విచ్చేసిన పొదుపు సంఘాల మహిళలనుద్దేశించి ప్రసంగించారు.గడిచిన మూడేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చానని, అది నెరవేరుస్తానని స్పష్టంచేశారు.రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అవాస్తవాలను ప్రతిపక్షం ప్రచారం చేస్తోందన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలను తాను ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడడం లేదని, ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టానని గుర్తుచేశారు. సాంకేతికతను ఉపయోగించి వాస్తవ లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయని దుయ్యబట్టారు. 

  రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కకుండా చేయాలన్నదే తన ఆశయమని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కట్టుబట్టలతో వచ్చామనిబస్సులోనే పడుకునిఅక్కడినుంచే పరిపాలన సాగించిప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేశామంటే అది తెలుగు దేశం పార్టీకి ఉండే సమర్థత... ప్రజల మీద ఉండే ప్రేమ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్బంగా సీఎం పొదుపు సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పలు సమస్యలపై వివరాలను సీఎం అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోటు బడ్జెట్‌లో ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామనిఎక్కడా ఆపలేదనిప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళుతున్నామని అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతిపక్షం ప్రతి రోజూ విమర్శలు చేస్తోందనిఅయినా అవేమీ పట్టించుకోననిప్రజల సంక్షేమమే తనకు కావాల్సిందనిరాష్ట్ర అభివృద్ధి జరగాలనిచంద్రబాబు తెలిపారు.రాజకీయ పార్టీలో ఉండే తాము అధికారంలో ఉండగలిగితేనే పనులు చేయగలుగుతామని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ది చేసింది తానేననిప్రపంచం మొత్తం హైదరాబాద్‌ను గుర్తించిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన కృషి అని ఆయన పేర్కొన్నారు. ఏపీలో కష్టాలుసమస్యలు ఉన్నాయనిఅలాగని భయపడితే జరిగేది ఏమీ లేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింభవళ్లు కష్టపడుతున్నానని చెప్పారు. మూడేళ్లలో చూస్తే భారత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి జరిగిందనిఅది తెలుగుదేశం పార్టీ సత్తా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే అభివృద్ది జరుగుతుందోఆదాయం పెరుగుతుందని ఆదాయం పెరిగితే ఉపాధి వస్తుందని... తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం చేపట్టానని చెప్పారు. జిల్లాలో ఇంకా అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నంద్యాలలోని మార్కెట్ యార్డులో వివిధ శాఖల స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు.

(192)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ