లేటెస్ట్

వచ్చే ఎన్నికలకు అప్పుడే హామీలు...!?

ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా సమయం ఉన్నా..అధికార వైకాపా పార్టీ అప్పుడు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్‌ ఈ విషయంపై ఇప్పటికే తన కోర్‌టీమ్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమైన నాయకులకు ఆయన సూచిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో అందరం ప్రజల్లోనే ఉందామని, తాను కూడా వారం వారం ప్రజల్లోకి వస్తానని చెపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి వైకాపా ఎన్నోహామీలను గుప్పించింది. వాటిలో కొన్నింటిని అమలు చేసింది. అయితే నవరత్నాలను మాత్రమే అమలు చేసి, మిగతా వాగ్ధానాలను పక్కన పెట్టింది. నవరత్నాలను గట్టిగా అమలు చేస్తూ తాము అన్ని హామీలను అమలు చేశామని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అయితే తమ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను తప్పరని, అన్ని వాగ్ధానాలను ఆయన నెరవేర్చారని ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు,టీవీ ఛానెల్స్‌, వైకాపా సోషల్‌ మీడియా అప్పుడు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా..వాటిన్నింటిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేసి అన్ని హామీలను నెరవేర్చామని చెప్పుకుంటోంది. అయితే..ఇప్పటికే ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేస్తుండగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని హామీలను ఇవ్వాలని ముఖ్యమంత్రిజగన్‌ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏయే హామీలను వచ్చే ఎన్నికల సందర్భంగా ఇవ్వాలి..? అనేది గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వైకాపా అధినాయకత్వం భావిస్తోంది. ఈ కమిటీకి ఎవరిని నాయకుడిగా పెట్టాలనే దానిపై పార్టీ కసరత్తు చేస్తోంది. కొందరు మాజీ ఐఏఎస్‌ అధికారులతోపాటు, గతంలో మ్యానిఫెస్టో కమిటీలో కీలకంగా వ్యవహరించిన ‘ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు’ను ఛైర్మన్‌గా నియమించాలని ‘జగన్‌’ భావిస్తున్నారట. ఆయనతో పాటు ఆర్థికశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఐఏఎస్‌లను కూడా దీనిలో సభ్యులుగా చేసి పరోక్షంగా వారి సేవలను ఉపయోగించుకోబోతున్నారట. మొత్తం మీద ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే ‘జగన్‌’ బృందం కొత్తం హామీల కోసం కసరత్తు చేస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ