WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరులో విజృంభిస్తున్న దోపిడీ దొంగలు...!

వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి...తలుపులు వేసిన తాళాలు వేసినట్లే కనిపిస్తాయి...అయినా సరే..దొంగతనాల్లో అపారమైన అనుభవం ఉన్న ప్రబుద్దులు కొందరు గుంటూరు నగరంలో ఇటీవల కాలంలో పట్టపగలు దోపిడీలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కొరిటెపాడు ప్రాంతంలో కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి మరో ప్రాంతానికి వెళ్లిన విషయం వీరికి ఎలా తెలిసిందో కానీ ఆ ఇంట్లో దొంగతనం చేసి సుమారు లక్షరూపాయల వస్తువులను దోచుకున్నారు. వేసిన తాళం యధావిధంగానే ఉంది. ఘడియకు ఉన్న నట్లును ఊడతీసి ఇంట్లోకి ప్రవేశించి దొంగనతం చేశారు. మరోచోట ఏదో విధంగా తలుపులు తెరిచి ఆ ఇంట్లో నిద్రించేవారికి మత్తుమందు ఇచ్చి దోచుకెళ్లారు. గుంటూరు నగరంలో ఇటువంటి దోపిడీలు కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వీరు బంగారు ఆభరణాలను నోట్లను మాత్రమే దోచుకెళుతున్నారు...ఇతర వస్తువుల జోలికెళ్లడం లేదు. ఈ దోపిడీదారులు గుంటూరు నగరానికి చెందిన వారా..?ఏ ప్రాంతం నుండైనా నగరానికి వచ్చారా...? లేదా పొరుగు రాష్ట్రాల నుండి టీమ్‌గా గుంటూరు నగరంలోకి ప్రవేశించారా..? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బంగార ఆభరణాలను కానీ, సొమ్ముల రూపంలో ఇంట్లో ఉంచుకోవద్దని, ఏదైనా ఊరు వెళితే సంబంధించిన పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్లండని ఎన్ని సార్లు చెప్పినా చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా దోపిడికి గురైనవారు ఆవేదనకు గురవుతున్నారు. గుంటూరు నగరానికి పరిమితమైన దోపిడీ దొంగలు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా దోపిడీలు చేస్తున్నారని పత్రికలు కథనాలు ప్రచురించాయి. కెమెరాలు లేని ప్రాంతాలనే ఎన్నుకుని వీరు దోపిడీ చేస్తున్నారని వీరు చేస్తున్న శైలిని బట్టి తెలుస్తోంది. సిసి కెమెరాలు లేని ప్రాంతాల్లోకి ఎవరెవరు వస్తున్నారో..ఎవరు రెక్కీకి వస్తున్నారో...ముందుగానే పథకం ప్రకారం తెలుసుకుంటున్నారు. వీరికి స్థానికులు ఎవరైనా మద్దతు తెలుపుతున్నారా..? లేక వీరే రెక్కీలు నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారనే విషయంపై  వారు పట్టుబడితే కానీ తెలియదు. పోలీసులు బందోబస్తు గట్టిగానే చేస్తున్నా...ఈ వారం రోజుల్లో పలుచోట్ల దొంగతనాలు జరిగాయి. కొద్ది రోజుల వరకు దొంగతనాలు జరగని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేస్తున్నారని జరిగిన దొంగతనాలను బట్టి స్పష్టమవుతోంది. 

  మాయింట్లో దొంగతనం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారిని సూటిపోటీ మాటలతో పరోక్షంగా కొందరు పోలీసులు విమర్శిస్తున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. తాము ఇన్ని విధాలుగా బందోబస్తు నిర్వహించినా, హెచ్చరించినా..ఖరీదైన ఆభరణాలను ఇంట్లో పెట్టుకోవద్దని చెబుతున్నా...వాటిని పాటించకుండా తమ సొమ్మును దోచుకుపోయారని చెబుతున్నారని... మీరందరూ ఉన్నత విద్యావంతులైనా..మీరే బాధ్యతగల పౌరులుగా వ్యవహరించకపోతే ఇటువంటి సంఘటనలే జరుగుతాయని, ఏదో విధంగా దొంగలను పట్టుకుంటాం..వారి దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేసుకున్నట్లు కబురు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పలు కాలనీలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు..అద్దె రూమ్‌లు తీసుకున్నారని, వారికి తెలుగు రాదని, అటువంటి వారిపై నిఘాపెడితే అసలు దొంగలు దొరుకుతారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుంటూరు నగరంలో జరుగుతున్న దొంగతనాలు ప్రజలకు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం నగర ఎస్సీగా బాధ్యతలు చేపట్టిన నగర ఎస్పీ కఠిన వైఖరి అవలంభించి దోపిడీ దారుల ఆగడాలను అరికట్టకపోతే రానున్న రోజుల్లో పోలీసులపై ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది. దొంగతనాలు చేస్తుంది..స్థానికులా..? స్థానికుల మద్దతుతో పొరుగు రాష్ట్రం వారు చేస్తున్నారా...? ఇందులో లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా..? అనే విషయం పోలీసులు త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉంది.


(305)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ