WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చ‌దువురాని వారితో చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌ను :ఐల‌య్య‌...!

తన ఇంటికి వచ్చి గొడవ చేయాలని చూస్తున్న వైశ్య సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొత్తులని కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షానే తన ఇంటిపైకి వైశ్యులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తన ఇంటికి రావడానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎవరని ప్రశ్నించిన ఐలయ్య, ఆయన వస్తే సమాధానం చెప్పడానికి తన జాతి సిద్ధంగా ఉందని, ధైర్యముంటే రావాలని సవాల్విసిరారు.అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి తనను చర్చకు ఆహ్వానిస్తే వస్తానని, వైశ్యులు జాతికి చేసిన ద్రోహంపై మాట్లాడతానని అన్నారు. చదువురాని వారితో తాను చర్చకు వెళ్లే ప్రసక్తే లేదని, చేతనైతే అమిత్ షా వచ్చి తనతో బహిరంగ చర్చకు కూర్చోవాలని, ఇలా ఇళ్లపైకి తన మనుషులను పంపిస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.కాగా ముందుగా చెప్పినట్టుగానే వైశ్య సంఘాల నేత శ్రీను తార్నాకలోని ఐలయ్య ఇంటి సమీపానికి చేరుకున్నారు. అప్పటికే ఐలయ్య మద్దతుదారులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు, ఓ వర్గం వారిని మరో వర్గం వారితో కలవనిచ్చేది లేదని ఇప్పటికేష్టంచేసారు.ఇక మరోపక్క, తన ఇంటికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, జరిగే ఘటనలకు వైశ్యులదే బాధ్యతని ఐలయ్య చెప్పగా, ఆ తీవ్ర పరిణామాలు ఏంటో చూస్తామని వైశ్య సంఘాలు విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం వైశ్య నేతలు తార్నాక ఫ్లయ్ ఓవర్ వైపు నుంచి ఐలయ్య ఇంటి వైపు వెళుతుండగా, వారిని అక్కడే మకాం వేసిన పోలీసులు బారికేడ్లతో అడ్డుకుంటున్నారు. సామాజిక స్మగ్లర్లు వైశ్యులు' అంటూ కంచ ఐలయ్య రాసిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపగా, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గడచిన నెలన్నర రోజులుగా వైశ్య సంఘాలు డిమాండ్ చేస్తున్నవిషయం తెలిసిందే.

(87)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ