WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ పోస్టు భర్తీలో జాప్యమెందుకో...!?

పశుసంవర్థకశాఖ శాశ్విత డైరెక్టర్‌ పోస్టు కోసం ఇద్దరు అధికారులు పరస్పరం పోటీపడుతూ కోటి నుండి కోటిన్నర వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంతకు ముందు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనం సంచలనం సృష్టింది. ఈ కథనం ప్రచురితమైన తరువాత ఈ పోస్టును భర్తీ చేయలేదు. శాఖకు డైరెక్టర్‌గా గతంలో బాధ్యతలు నిర్వహించిన 'కొండలరావు' తన ఆరోగ్యపరిస్థితి సహకరించడం లేదని, తానా పోస్టుకు న్యాయం చేయలేనని, లిఖితపూర్వకంగా తెలియజేయగా ఆయనను వేరే ప్రదేశానికి బదిలీ చేసి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా సోమశేఖర్‌ను నియమించడం జరిగింది. తాజాగా 'కొండలరావు' తన ఆరోగ్యం చక్కబడిందని, తనపై ఇంతకు ముందు ఉన్న ఆరోపణలు నిరాధారమని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని, సంబంధిత ఉత్తర్వుల కాపీతో ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంటూ డైరెక్టర్‌గా తనను నియమించాలని కోరారు. ఇటీవల డిపిసి నిర్వహించి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా ఉన్న 'సోమశేఖర్‌'ను డైరెక్టర్‌గా ప్రమోట్‌ చేయటం జరిగింది. ఈ ఇద్దరిలో ఒకరు మంత్రి సమీపబంధువుకు రూ.50లక్షలు ముట్టచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరొక అధికారి సిఎం కార్యాలయ అధికారి అంతరంగికులకు కొన్ని లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి తనను డైరెక్టర్‌గా నియమించమని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఎలాంటి లంచం ఎవరికీ ఇవ్వలేదని సీనియార్టీ ప్రాతిపదికన తనను నియమించాలని కోరుతున్నట్లు 'కొండలరావు' చెబుతున్నారు. 'కొండలరావు' తన కన్నా సీనియర్‌ అని...ఆయననే డైరెక్టర్‌గా నియమించాలనే అభిప్రాయాన్ని 'సోమశేఖర్‌' వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కూడా 'కొండలరావు'నే డైరెక్టర్‌గా నియమించాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేశారు. 

  తనపై అవినీతి ఆరోపణలు లేవని, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తననే డైరెక్టర్‌గా నియమించాలని 'కొండలరావు' కోరినప్పుడు ఆయనకే ఆ పోస్టు ఇవ్వాలని 'సోమశేఖర్‌' అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్నా..ఇంత వరకు ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డైరెక్టర్‌ పోస్టు కోసం ఒకరు కోటి మరొకరు కోటిన్నర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, పశుసంవర్థకశాఖలో ప్రచారం జరుగుతుందని గతంలో 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాలను ప్రచురించింది. సీనియర్‌ అధికారిని డైరెక్టర్‌ పోస్టులో నియమిస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని జూనియర్‌ అధికారి చెపితే ప్రభుత్వం ఎందుకు ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. మంత్రి బంధువుకు ఒకరు..సిఎంఒ అంతరంగిక అధికారిని పదే పదే కలిశారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరెవరికీ ఏమేమి ముట్టిందో ఆధారాలు బయటపడకపోయినా...'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనం ఈ శాఖలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వారంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాల భోగట్టా. ఇద్దరు అధికారులు డైరెక్టర్‌ పోస్టు కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వారు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో...కానీ..గతంలో డైరెక్టర్‌ పదవి నిర్వహించిన 'కొండలరావు' తాను ఇప్పటికీ అప్పుల్లో ఉన్నానని చెబుతుండగా..మరొక అధికారి 'సోమశేఖర్‌' తానెవరికీ ఎటువంటి ముడుపులు ఇవ్వలేదని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ పోస్టు భర్తీలో జాప్యానికి కారణాలు ఏమిటి..? మంత్రి సిఫార్సు చేశారు..? తాను ఆరోగ్యంగా ఉన్నానని 'కొండలరావు' చెబుతున్నారు...ఆయనను డైరెక్టర్‌గా నియమిస్తే తనకు అభ్యంతరం లేదని 'సోమశేఖర్‌' చెబుతున్నారు..అయినా ముఖ్యమంత్రి ఇంత వరకు ఎటువంటినిర్ణయం తీసుకోలేదు.

(152)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ