WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోన్న జ‌గ‌న్...!

మాట తప్పడం-మడమ తిప్పడం  అని చెప్పేటటువంటి  జగన్మోహన్ రెడ్డి  ఈ రోజు మాట తిప్పటం,మాయ చేస్తూన్నార‌ని,   యువగర్జన పేరు తో ప్రజల ను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి  మరొక సారి బయలుదేరారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కె.ఎస్ జవహర్ విమ‌ర్శించారు. గతం లో ప్రత్యెక హోదా రాకపోతే తమ ఎంపీ లతో రాజీనామా చేయిస్తాన్న  జగన్ మోహన్ రెడ్డి  ఎటువంటి హామీ లేకుండానే జైలు నుండి  ఏవిధంగా తప్పించుకోవాలి, బెయిలు ఏవిధంగా తెచ్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడని దుయ్య‌బ‌ట్టారు. తన యొక్కఆర్ధిక అక్రమ లావా దేవి లు ఏవిధంగా  రుపుమాపలానే ప్రయత్నంతోనే రాష్టపతి ఎన్నికల్లో మద్దతు తెలిపార‌ని, యువగర్జన పేరు తో ప్రజల ను మోసo  చేయడానికి అనoతపురం లో యువగర్జన ప్రారంభిచాడని విమ‌ర్శించారు.  అనoతపురం లో వర్షాలు బాగా పడుతున్నాయని నీలాంటి వాళ్ళు పాదం పెడితే మళ్ళిఅనంత‌పురం కరువు సీమగా మారుతుందని కావున అక్కడ నుండి తిరిగి వచ్చేయాలని అన్నారు.  ముఖ్యమంత్రి చంద్ర బాబు  పరిపాలన పట్ల ప్రజలు 80% సంతృప్తిగా ఉన్నారని , ఆ విషయం నీ కు ఇష్టం లేక పాదయాత్ర ,యువగర్జన చేస్తున్నావో ప్రజలకు  అర్ధం కావడం లేదు అని అన్నారు.. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత మంచి వాతావరణం లో ఇక్కడ పార్టీ ఆఫీసు పెట్టడానికి నికి టైం దొరక్క జైలు- బెయిలు ఈ రెండు పదాలే తప్ప నీకు ఏవి గుర్తు కు రావడం లేదు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిoచాలని తెలిపారు.నీ వాదన-వాదం ఎవరికీ తెలియడం లేదు. .నీ ముసుగు తీసేసి వాస్తవాల తో బయటకు రావాలని అన్నారు... నీ కు అధికారం అందని ద్రాక్ష, ఏపి ప్రజలు చాలా తెలివిగల వారు ,విజ్ఞత కల వారు చంద్ర బాబు గారి పరిపాలన వల్లే రాష్ట్రం బాగు పడుతుందని వారు చంద్ర బాబు గారికి అధికారం అప్పజేప్పారు.ఇంకొక 20 సం  వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఎవరికీ దగ్గరకు పోదని , ఎందుకంటే సంక్షేమo మరియు అభివృద్ధి తో చంద్ర బాబు నాయుడు గారు రాష్టాన్ని  ముందుకు తీసుకెళ్తున్న సంధర్బం లో, ప్రజానీకం కూడా సంతృప్తి తో ఉన్నారని తెలిపారు.

(127)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ