WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బడ్జెట్ ఉన్నంతమేరకు ఇన్సెంటివ్స్ ను విడుదల చేద్దాం

శాఖాపరమైన సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి నిర్ణయం

ఎస్సీ, ఎస్టీలకు ఇన్సెంటివ్స్‌ లను పూర్తిగా క్లియర్ చేయండి

ఎంప్లాయిమెంట్ ఇవ్వని పరిశ్రమలపై దృష్టి పెట్టాలి

అమరావతి(వెలగపూడి సచివాలయం) : ఈ ఏడాది పరిశ్రమల శాఖ విడుదల చేసిన బడ్జెట్ మేరకు పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ను విడుదల చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథరెడ్డి నిర్ణయించారు. బుధవారం వెలగపూడి సచివాలయం, నాల్గవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఆయన శాఖ పరమైన సమీక్ష నిర్వహించారు. 2014, 15, 16తో పాటు అంతకుముందు నుంచి పెండింగ్‌లో ఇన్సెంటివ్స్ కేసులను పరిశీలించి, వాటికి ప్రస్తుత బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ కేసులు ఏమైన ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పారు. మిగతా పెండింగ్ ఇన్సెంటివ్స్ కు బడ్జెట్ కేటాయింపులపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. ఇక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటున్న కొన్ని పరిశ్రమలు అందుకుతగ్గట్టు ఎంప్లాయిమెంట్(ఉపాధి) కల్పించడం లేదని, అలాంటి వాటిపై దృష్టిసారించాలని మంత్రి అధికారులను కోరారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో భూకేటాయింపులుపై ఎంతవరకు వచ్చాయని మంత్రి అడగగా, రెండు దశల్లో పూర్తి చేస్తామని, నవంబర్ 1 నుంచి మొదటి దశలో భాగంగా భూకేటాయింపులు చేస్తామని అధికారులు మంత్రికి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లో ఉన్న సమస్యలను టెక్నాలజీని ఉపయోగించుకొని పరిష్కరించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సొల్మన్ ఆరోఖ్యరాజ్, కమిషనర్ సిద్ధార్థ జైన్, ఏపీఐఐసి ఎండి ఎ.బాబు, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ వైఎస్ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

(54)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ