WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉస్మానియా కళాశాల అధ్యాపకులకు జాతీయస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులు...!

స్థానిక ఉస్మానియా కళాశాల హిందీశాఖాధిపతిగా విధులు నిర్వహిస్తున్న డా.ఎస్‌.సలీంభాషాకు మరియు జంతుశాస్త్ర శాఖలో రీడర్‌గా మరియు ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒగా విధులు నిర్వహిస్తున్న డా.ఎస్‌.మహమ్మద్‌గౌస్‌కు సి.వి.ఎస్‌ క్రిష్ణమూర్తి తేజ చారిటీస్‌ వారు 2017 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డును ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో తుడా వైస్‌ ఛైర్మన్‌, తిరుపతి మన్సిపల్‌ కమీషనర్‌ సి.హరికిరణ్‌ మరియు సి.వి.ఎస్‌ క్రిష్ణమూర్తి ఛారిటీస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుచరిత మరియు ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును అందజేసి ఇద్దరినీ ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీతలు డా.ఎస్‌.సలీంభాష, డా.ఎస్‌.మహమ్మద్‌గౌస్‌ మాట్లాడుతూ తాము విద్యాభివృద్ధికి సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. ఉస్మానియా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్‌ అజ్రా జావేద్‌ మాట్లాడుతూ డా.ఎస్‌.మహమ్మద్‌ గౌస్‌ 2015 సంవత్సరములో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్నారని, డా.ఎస్‌.సలీంభాష 2017 సం.లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్నారని, ఇవే కాక ఇరువురు అనేక అవార్డులను, ప్రశంశా పత్రాలను అందుకున్నారని, అవార్డు గ్రహీతలను అభినందింఛారు. కళాశాల ప్రిన్స్‌పాల్‌ నియమతుల్లా మాట్లాడుతూ కళాశాల అధ్యాపకుల కృషిని రాష్ట్రప్రభుత్వంతో పాటు, స్వచ్చంధ సంస్థలు కూడా గుర్తించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఎసి సమన్వయకర్త ఎస్‌.సమీవుద్దీన్‌ యుజమ్మిల్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


(91)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ