WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సీఆర్‌డిఎ వివాదాస్పద భూముల పరిష్కారంలో కోట్లు గడిస్తోన్న అధికారి...!

రాజధాని ప్రాంతాలతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కార్యాలయం అది. ఆ కార్యాలయం పేరు సిఆర్‌డిఎ. గతంలో ఉన్న అమరావతి అభివృద్ధి సంస్థ పేరును సిఆర్‌డిఎగా మార్చి అదనపు సౌకర్యాలను, ఉద్యోగులను నియమించారు. ఈ సంస్థకు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతుల స్వచ్చంధంగా భూములు ప్రభుత్వానికి ఇవ్వడంలో ఎంతో కష్టపడ్డ గత జాయింట్‌ కలెక్టర్‌, ప్రస్తుత సిఆర్‌డిఎ కమీషనర్‌ 'చెరుకూరి శ్రీధర్‌' పేరుతో అక్కడ పనిచేసే క్రిందిస్థాయి అధికారి ఒకరు అడ్డగోలుగా కోట్లు సంపాదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వివాదాస్పద భూముల విషయంలో ఆ అధికారి కలుగ చేసుకుంటూ, రెండు వర్గాలకు నచ్చ చెప్పి...మీకు..ఇంత..నాకు ఇంత...అని వాటాలు వేస్తున్నట్లు సిఆర్‌డిఎలో ప్రచారం జరుగుతోంది. కమీషనర్‌ 'శ్రీధర్‌' నిజాయితీపరుడు, సమర్థుడని పేరు తెచ్చుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో పాటు, భూములు ఇచ్చిన రైతుల అభిమానాన్ని కూడా పొందిన విషయం అందరికీ తెలుసు. ఏ అధికారైతే వివాదాస్పద భూముల విషయంలో కలుగ చేసుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారో..ఆ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎవరి ప్రభావం పనిచేస్తుందో...ఏ ఒత్తిడిలు పనిచేశాయో కానీ...ఆ అధికారి బదిలీ ఉత్తర్వులు రద్దు అయ్యాయి..దీంతో ఆ అధికారి మరింత రెచ్చిపోయి..నన్నెవరూ ఏమీ చేయలేరు అన్న ధీమాతో మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ అధికారి కష్టపడి పనిచేస్తారు..అందుకే ఆయన సేవలనువినియోగించుకుంటున్నామని సిఆర్‌డిఎ కమీషనర్‌ శ్రీధర్‌ చెబుతున్నారట. 

  ఇన్ని వర్గాల్లో వ్యతిరేకతతో పాటు, విమర్శలు, ఆరోపణలు ఉన్న అధికారి వ్యవహారం 'శ్రీధర్‌'కు తెలుసా..లేదా...? అన్నవిషయంపై ఎవరూ వ్యాఖ్యానించడం లేదు. ఈ సంవత్సర కాలంలో ఆ అధికారి పనితీరు, వ్యవహారశైలిపై విచారణ జరిపితే వెలుగులోకి రాని మరెన్నోవాస్తవాలు బయటపడడం ఖాయం. ఈ అధికారికి 'శ్రీధర్‌' మద్దతు ఉందా..? మరెవరైనా ఉన్నత వ్యక్తులు, రాజకీయనాయకుల మద్దతు ఉందా...? అన్న విషయంపై ఇక్కడ పనిచేసే ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదు. కానీ ఆ అధికారి దూకుడుగా వ్యవహరిస్తున్నారని, వివాదాస్పద భూముల విషయంలో కలుగచేసుకుంటున్నారని, వాటిపై విచారణ జరిపితే నిజానిజాలు బయటపడతాయని కొందరు చెబుతున్నారు. తెలిసికానీ...తెలియక కానీ...కళ్లు మూసుకుని కానీ..కళ్లు తెరచుకుని కానీ..నిప్పును పట్టుకుంటే కాలడం ఖాయం. పట్టుకునే విధానాన్నిపట్టి నిప్పు ఎంత వరకు కాలాలో అంత వరకే కాలుతుంది. అదేవిధంగా అవినీతి అధికారి తన కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి..ఆయన వ్యవహారశైలిపై దృష్టి నిజ,నిజాలు తెలుసుకోవాల్సిన సిఆర్‌డిఎ కమీషనర్‌ 'చెరుకూరి శ్రీధర్‌' కష్టపడి పనిచేస్తున్నారన్న గుడ్డి నమ్మకంతో ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

(191)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ