WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సివిల్‌ సప్లైయిస్‌ కమీషనర్‌ రామాంజనేయులు...గ్రామీణాభివృద్ధికి 'కోన'...!

సివిల్‌ సప్లైయిస్‌ మరియు ఎక్సైజ్‌ అపీషియో కార్యదర్శిగా పంచాయితీరాజ్‌శాఖ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌ రామాంజనేయులును నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'రాజశేఖర్‌'ను వ్యవసాయశాఖ,మరియు మార్కెటింగ్‌శాఖాధిపతిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు పౌరసరఫరాలశాఖకు కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఆ మూడు శాఖలకు అదనపు బాధ్యతలను రాజశేఖర్‌ నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా  సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి సత్తా చూపిన రామాంజనేయులు తాను కార్యదర్శిహోదాలో సచివాలయంలో బాధ్యతలు రిటైర్‌ కావాలని కోరుకుంటున్నారు. ఆయనను అక్కడ నుండి బదిలీ చేస్తే ఆయన స్థానంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోనశశిధర్‌ను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు 'కోన శశిధర్‌'ను పిలిచి చెప్పగా..తాను మరి కొంత కాలం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ ప్రతిపాదన తాత్కాలికంగా నిలిచిపోయింది. 

   గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన 'రామాంజనేయులు' స్థానంలో ఆయన వలే బాధ్యతలు నిర్వహించే అధికారిని నియమించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. 'కోన శశిధర్‌'ను గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా నియమించుకోవాలని, ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా భావిస్తున్నారు. ఇదే విషయంపై 'కోన శశిధర్‌'తో 'లోకేష్‌' స్వయంగా మాట్లాడినట్లు తెలిసింది. ఇవన్నీ ఈ మాసాంతానికి కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. సచివాలయంలో తనను కార్యదర్శిహోదాలో నియమించాలని 'రామాంజనేయులు' తనను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తప్పించవద్దని 'శశిధర్‌'లు కోరుతున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయం త్వరలో బయటపడనుంది.



(487)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ