WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉపాధి నిధుల బ్రేక్‌..పాపం ఎవరిది...!?

జూలై మాసం నుండి ఇప్పటి వరకు ఉపాధి నిధులను విడుదల చేయటంలో కేంద్ర జాప్యం చేస్తోంది. కొన్ని వందల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైన కేంద్రం ఆఖరు నిమిషంలో నిలిపివేసింది. 'జగన్‌' పార్టీ ఎంపీలు చేసిన ఫిర్యాదుతో నిధులను నిలిపివేసిందా..? లేక ఇంకేదైనా కారణాలతో నిలిపివేసిందా..?అనే దానిపై రాష్ట్ర అధికారులు కేంద్ర అధికారులతో సంప్రదిస్తున్నారు. సంబంధించిన కేంద్రశాఖాధిపతితో రాష్ట్ర ముఖ్య అధికారులు స్వయంగా ఫోన్‌లో మాట్లాడడం జరిగిందని, ఒకటి రెండురోజుల్లో బకాయి నిధులు విడుదల చేస్తామని చెప్పినట్లు ఉన్నతాధికారి ఒకరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రత్యేక ప్రతినిధికి తెలిపారు. 

  ఉపాధి కూలీలకు వేతనాలు రాకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. సిసి రోడ్లు, ఇతర అనుబంధశాఖల అభివృద్ధి పనులకు మెటీరియల్‌ కాంపౌండ్‌నిధులు కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలలో జాప్యం జరగడంతో అనేక అభివృద్ధి పనులకు అంతరాయం కలుగుతోంది. కూలీలకు పనులు లేని సమయంలో ఉపాధి పథకం ద్వారా పనులు చేయిస్తున్న అధికారులు వారికి కూలీ చెల్లించడంలో నిధులు లేకపోవడం చేతులెత్తేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేల మంది కూలీలు పనులు చేస్తున్నా..నిధులు లేకపోవడంతో వారికి కూలీ చెల్లించకపోవడానికి కారణం ప్రతిపక్షనేతలు చేసిన ఫిర్యాదే కారణమని, దీనికి వారే బాధ్యులని, నిజానిజాలు తెలుసుకుని కేంద్రం త్వరలో నిధులు విడుదల చేస్తుందని అధికారపార్టీనేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ గ్రౌండ్‌ నిధులు ఉపాధి పనులతోనే జరుగుతున్నాయి. చేసిన పనులకు కూలీ ఇవ్వకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లే కూలీలు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దాదాపు మూడు నెలలుగా వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని అధికారులు కూడా చెబుతున్నారు. నేడో రేపో నిధులు విడుదల కావడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధుల విడుదల జాప్యంపై కేంద్ర అధికారులతో సంప్రదించడానికి పలు మీడియా వర్గాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తాము..ఎవరెవరితో మాట్లాడాలో వారితో మాట్లాడామని నిధులు విడుదల చేసేందుకు కేంద్ర అధికారులు అంగీకరించారని, గతంలో నిధులు నిలిపివేయమన్న పిఎంఒ అధికారులు తరువాత నిధులు విడుదల చేయమని చెప్పడం జరిగిందని కొందరు అధికారులు ఎపికి చెందిన అధికారులతో ఆఫ్‌ ది రికార్డుగా చెప్పారు. ఎవరెవరు ఫిర్యాదులు చేశారో..ఏయే కారణాలతో నిధులు ఆపేశారో కానీ..ఉపాధి కూలీలు ఆకలితో మాడిపోతున్నారు.


(110)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ