WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బలహీనతలతో బ్రష్టుపట్టిన అధికార ఎమ్మెల్యే...!

ఆయన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఆర్థిక పరంగా వందల కోట్లు ఆస్తులు సంపాదించుకున్నారు..! చేసే వ్యాపారాలకు రాజకీయ, అధికార గణం కలిసి రావడంతో స్వపక్షీయులతో పాటు,విపక్షనాయకులు ఊహించని ఆర్థికపరమైన ఎత్తుకు ఆ ఎమ్మెల్యే ఎదిగారు. పదవి ఉన్నా లేకున్నా..ప్రజలకు సహాయ,సహకారాలు అందించడంలో ఆ ఎమ్మెల్యే ముందుంటారు..! అంత వరకు బాగానే ఉంది...ఇటీవల కాలంలో ఒక మహిళ ఆ ఎమ్మెల్యేకు సన్నిహితమయ్యారు. దీంతో ఆమె బంధువు ఒకరు ఎమ్మెల్యే తరుపున పెత్తనమంతా చేస్తున్నారు. నిన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ మహిళా బంధువు వ్యవహారం తాజాగా జిల్లా స్థాయికి చేరుకుంది. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రసవత్తరమైన చర్చ జరుపుతున్నారు. రాజకీయంగా తనను ఎవరూ ఏమీ చేయలేరని, ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఓడించలేరని ఆ ఎమ్మెల్యేలో వ్యక్తం అవుతుంది. కానీ చిన్నపాటి బలహీనత ఆయన పాలిట శాపంగా మారింది. నిన్నటి వరకు ఎటువంటి బలహీనతలు లేని ఆ ఎమ్మెల్యే ఎలా బుట్టలో వేసుకున్నారో కానీ..వారి చేతిలో ఆయన కీలు బొమ్మ అయ్యారనే ప్రచారం జరగడంతో పాటు పలు విమర్శలకు కారణం అవుతున్నారు. 

  ఈ విషయంపై విపక్షాలకు చెందిన నాయకులు, రేపో..మాపో బాహాటపు విమర్శలు చేసే అవకాశం ఉంది. 'మా ఎమ్మెల్యేకు ఎటువంటి బలహీనతలు లేవు..ఆయన దగ్గరకు ఎవరెవరో వస్తుంటారు..పోతుంటారు..స్వతంత్రంగా మాట్లాడినంత మాత్రాన...వారి చేతిలో మా ఎమ్మెల్యే కీలుబొమ్మ అవుతారా..? అని ఆ ఎమ్మెల్యే అనుచర వర్గం ఆగ్రావేశాలతో ఊగిపోతున్నారు. పలువురు చూస్తుండంగా ఆ విధమైన ఆగ్రావేశాలతో ఊగిపోయే వారు...ఆఫ్‌ ది రికార్డుగా బంధువులతో, మీడియా వర్గాలతో మాట్లాడుతూ 'మా ఎమ్మెల్యేకు ఇంత బలహీనతా..ఇప్పుడు ఇంత బలహీనత ఎలా...వచ్చిందో...? అని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం ఎమ్మెల్యే నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. గ్రామాల్లో ఎమ్మెల్యే వ్యవహారం గురించి చర్చోపచర్చలు చేస్తున్నారు. ఇంకా పూర్తిగా ఆ ఎమ్మెల్యే వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లక ముందే సరిచేసుకుంటే రాజకీయంగా నిలబడతారు..లేకుంటే రాజకీయంగా అధోపాతాళం తప్పదని కొందరు సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారం సశేషంగా మిగులుతాయో...చివరకు ఏ విధంగా ముగిస్తుందో మరి కొద్ది రోజులు గడిస్తే కానీ బయటపడదు.


(243)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ