WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జనవరి నాటికి రక్తహీనత రహిత జిల్లాగా కృష్ణా...!

అధికారుల‌కు ల‌క్ష్యాల‌ను నిర్థేశించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

2018 జనవరి నాటికి కృష్ణా జిల్లాను రక్తహీనత రహిత జిల్లాగా చేయాలని జిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' పట్టుదలతో ఉన్నారు. దీనిపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యాలను అందుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికే కొన్ని ఏరియాలను దృష్టిలో పెట్టుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ముఖ్యంగా వారు గర్బిణీస్త్రీలో రక్తహీనతను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే అధికారులు జిల్లాలో ఉన్న గర్బిణీస్త్రీలు, చనుబాలు ఇచ్చే స్త్రీలు మరియు కౌమార బాలికలను రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వర్గాలుగా విభజించారు. కృష్ణా జిల్లాలో దాదాపు 80వేల మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరిలో 7,870మంది మహిళల్లో హీమోగ్లోబిన్‌శాతం 8-10 పర్సెంట్‌ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ఐరన్‌ ఫ్లోలిక్‌ అసిడ్‌ టాబ్లెట్స్‌ ఇచ్చి వారిలో రక్తహీనతను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 'అన్న అమృతహస్తం' కార్యక్రమం ద్వారా గర్బిణీస్త్రీలు మరియు స్తన్యం ఇచ్చే మాతృమూర్తులు మరియు కౌమార బాలికలకు పోషకాహారంతో పాటు హెల్దీ డ్రింక్స్‌ను కూడా అందిస్తున్నారు. తల్లి మరణాలు మరియు రక్తహీనతను తగ్గించడానికి జిల్లా అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్లే కృష్ణా జిల్లాలో ఎక్కువ రక్తహీనత కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రకాలైన రక్తహీనత కేసులను హెల్దీ,బాలెన్స్‌డ్‌పుడ్‌, ఐరన్‌, విటమిన్‌బి12 మరియు విటమిన్‌సి ద్వారా తగ్గించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఎటువంటి రోగాలకైనా సమతులహారం సరైన మందని, ప్రత్యేకంగా రక్తహీనతకు ఇది ఇంకా అవసరమని వారు అంటున్నారు. 


  సరైన ఆహారపదార్థాల ద్వారా ఎటువంటి రోగాలనైనా నయం చేయవ‌చ్చ‌ని, అదే సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం అవసరమని, దీని ద్వారా రక్తహీనతపై పోరాడవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా శాఖాహారం తీసుకునే వారు నిర్ణీత కాలానికి రక్తపరీక్షలు మరియు ఇతర సప్లిమెంట్‌లు తీసుకోవడంపై డాక్టర్లతో చర్చించాలని చెబుతున్నారు.మారిన జీవన పరిస్థితులు, పనిచేసే చోట ఉన్న పరిస్థితులు వల్ల ఇటు వంటి వ్యాధులు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ దీనిపై జాగ్రత్త వహించాలని, అదే సమయంలో తాము తీసుకుంటున్న ఆహారంపై దృష్టి పెట్టాలని డాక్టర్‌ గౌతమ్‌ ప్రసాద్‌ తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాను రక్తహీనత జిల్లాగా మార్చేందుకు లక్ష్యాలను పెట్టుకున్నామని, వచ్చే జనవరి నాటికి జిల్లాలో రక్తహీనత కేసులు ఉండకూడదన్నదే తమ ధ్యేమని ఆయన అన్నారు. దీని కోసం తాము అన్ని రకాలైన చర్యలను తీసుకున్నామని మరియు దీనిపై ప్రజల్లో చైతన్యం కల్గించే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. తాము ప్రభుత్వ హాస్టల్స్‌ సందర్శించి దీనిపై అవగాహన కల్పిస్తున్నామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలని ఏ ఒక్క మహిళా రక్తహీనతతో బాధపడకూడదనేదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ లక్ష్యాలను సాధించడానికి కలెక్టర్‌ లక్ష్మీకాంతం తనదైన శైలిలో పనిచేస్తున్నారు. అధికారులకు లక్ష్యాలను ఇచ్చి...ఆ లక్ష్యాలను చేధించడానికి వారితో కలసి 'లక్ష్మీకాంతం' కష్టపడుతున్నారు. ఆయన కష్టం ఫలించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ