WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పంజాబ్ లో బీజేపీకి చుక్కెదురు

గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం
అమృత్‌సర్‌: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీగెలుపొందింది .కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జాఖర్‌ 1,93,219 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సునీల్‌కు అభినందనలు తెలియజేశారు. ‘కాంగ్రెస్‌ విధానాలు, అభివృద్ధికి లభించిన విజయం ఇది’ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. గురుదాస్‌పూర్‌ ప్రజలకు సునీల్‌ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆరు నెలల క్రితం పంజాబ్ లో సంకీర్ణ అధికారానికి దూరమైన బీజేపీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆరు నెలల నాడు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉంటుందని ఆశించిన బీజేపీ నేతలకు భంగపాటు కలిగిస్తూ, ప్రజలు తాము కాంగ్రెస్ వెంటే ఉన్నామని తేల్చి చెప్పారు. 

  రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ భారీ మెజారిటీతోవిజయంసాదించారు. ఆప్ తరఫున మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు కూడా చెప్పుకోతగ్గ ఓట్లు లభించాయి. సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.ఈ విజయం పట్ల ఆ రాష్ట్రమంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ హర్షం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకోనున్న రాహుల్‌గాంధీకి ఈ విజయం దీపావళి కానుక అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం రాహుల్‌గాంధీకి మేమిచ్చే అద్భుతమైన దీపావళి గిఫ్ట్‌. అకాలీ దళ్‌ నేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌కు ఈ ఫలితం చెంప పెట్టు. పంజాబ్‌లో అకాలీ దళ్‌ భారమని భాజపా గుర్తించాలి.’ అని సిద్ధూ ఎద్దేవా చేశారు.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ