WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

న‌న్ను చూసి ప్రభుత్వం భయపడుతోంది: కోదండరాం

హైదరాబాద్‌ అక్టోబర్ 15  : రాష్ట్రంలో ప్రభుత్వం బలహీన పడుతోందని, అందుకే ఐకాసను చూసి భయపడుతోందని ప్రభుత్వం చేతగాని తనం వల్లే తనతో పాటు 400 మంది ఐకాస నేతలు, కార్యకర్తలను నిన్న అక్రమంగా అరెస్ట్‌ చేసిందని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య ప్రభుత్వం కోదండరాం అన్నారు. నిన్నటి అరెస్ట్‌తో తమ సంకల్పం మరింత బలపడిందన్నారు.ఐకాస 6వ విడత అమరుల స్ఫూర్తి యాత్రను నిన్న పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో ఆదివారం తార్నాకలోని తన నివాసంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కోదండరాం ఆరోపించారు. అన్ని పార్టీలకూ నిన్నటి పరిణామాలు వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వ వ్యవహార శైలిపై గవర్నర్‌, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామన్నారు. యాత్రకు ముందే అనుమతి కోరినా, ఆఖరు నిమిషంలో పోలీసులు మనసు మార్చుకుని 13వ తేదీ అర్ధరాత్రి ఐకాస నేతలను అరెస్టులు చేశారన్నారు. మానభంగాలు, దొమ్మీల వంటి కాగ్నిజబుల్‌ నేరాలకు వర్తింప జేసే సెక్షన్‌ 151 కింద తమను అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ