WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ ఇఒ సింఘాలా...? శ్రీనివాసరాజా...?

టీటీడీ ఇఒగా డాక్టర్‌ సాంబశివరావు బాధ్యతలు నిర్వహించినంత కాలం అణిగిమణిగి ఉండడమే కాకుండా కేవలం తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లకే పరిమితమైన శ్రీనివాసరాజు ఆయన బదిలీ అయి సింఘాల్‌ ఇఓ అయిన తరువాత పరిపాలనంతా తన గుప్పెట్లోనే పెట్టుకునే స్థాయికి ఎదిగారు. తిరుమలలో అధికారి నియమించాలన్నా..బదిలీ చేయాలన్నా ఎవరిపైనైనా చర్య తీసుకోవాలన్నా 'శ్రీనివాసరాజు' చెప్పందే ఏమీ జరగదు. తిరుమలలో టిక్కెట్ల కేటాయింపుతో పాటు పాలనా వ్యవహారాలబాధ్యతలను శ్రీనివాసరాజుకు కట్టపెట్టారు ఇఒ. క్రిందిస్థాయి ఉద్యోగులు అవినీతికి అక్రమాలకు పాల్పడినా జెఇఒ శ్రీనివాసరాజు ఆశీస్సులు ఉంటే వారిపై ఎటువంటి చర్య తీసుకునే పరిస్థితే లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాసరాజు అధికారం పెట్రోల్‌లాగా  కనిపించగా చంద్రబాబు హయాంలో ఆయన అధికారం విమానాలకు వాడే ఉపయోగించే ప్యూయల్‌లా నడుస్తోంది. అప్పట్లో 'కిరణ్‌' సోదరుడితో అన్నీ లాలూచీలు..తాజాగా ఎవరెవరిని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ...ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీనివాసరాజుపై ఈగ వాలనివ్వడం లేదు. టీటీడీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 'చంద్రబాబు'కు సానుభూతిపరులైన అధికారులను, ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నా...స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోరు..తెలిసినా తెలియనట్లు ఉంటున్నారు జిల్లా మంత్రి. ఒకవేళ చంద్రబాబు దృష్టికి వెళ్లినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని పలువురు వాపోతున్నారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తమను అనేక ఇబ్బందులకు గురిచేశారు..అవమానించారు..బాధలు పెట్టారు..తాజాగా బాధలు పెట్టకపోయినా...సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. ఇంకా తాము ప్రతిపక్ష ప్రభుత్వంలోనే ఉన్నామని ఉద్యోగులు చెబుతున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం అవుతుంది.

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ