WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిజాయితీనీ,సమర్థతను ప్రోత్సహిస్తా: కలెక్టర్‌ లక్ష్మీకాంతం

సిఫార్సులకు తలొగ్గను...!

తాను రాజకీయనాయకుల సిఫార్సులకు తలొగ్గి బదిలీలు, పోస్టింగ్‌లు చేస్తున్నానని అనేక మంది చేస్తున్న విమర్శలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఖండించారు. ఏ అధికారి అయినా నిబంధనల ప్రకారం వ్యవహరించకపోయినా, అక్రమాలకు పాల్పడినట్లు రుజువులు ఉంటే అటువంటివారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయ నాయకుల సిఫార్సులను పట్టించుకోనని, నిజాయితీగా, సమర్థవంతగా బాధ్యతలు నిర్వహించడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేవారికి ప్రాధాన్యత ఇస్తానని, ఇటు వంటి దానిలో రాజీపడడని లక్ష్మీకాంతం తేల్చి చెప్పారు. ఏ అధికారి సేవలు ఎలా ఉపయోగించుకోవాలనే విషయం తనకు తెలుసనని, ఇటువంటి విషయాల్లో ఎవరి ప్రమేయం ఉండదని, స్వతగా నిర్ణయాలు తీసుకోవడంలో తనకు అధికార అనుభవం ఉందని 'లక్ష్మీకాంతం' చెబుతున్నారు. 

  అనేక కారణాలతో బదిలీలు, పోస్టింగ్‌లు చేస్తుంటామని,వీటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం కలెక్టర్‌కు ఉండదు. అవినీతి ఆరోపణలు వచ్చినా, అక్రమాలకు పాల్పడినా, అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోయినా వారిపై చర్యలు తీసుకోవడం కలెక్టర్‌గా తన బాధ్యత అని ఆయన అన్నారు. మంత్రి చెప్పారు...ఎమ్మెల్యేలు చెప్పారు...ఒత్తిడిలకు కలెక్టర్‌ తలొగ్గారు..ఎవరెవరో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తాను పట్టించుకోనని, ప్రభుత్వ సర్వీసులో ఉన్నంత కాలం తన అధికార బాధ్యతలు ఈ విధంగానే నిర్వహిస్తాను..తన పరిధిని ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ లేదు..ఎక్కడైనా...ఎవరైనా...అవినీతికి, అక్రమాలకు, తప్పులు చేస్తుంటే తన దృష్టికి వస్తే వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాను.. దీనికి కూడా రాజకీయ ఒత్తిడిలు అని అంటే ఎలా..అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జిల్లా ముందుకు వెళుతుందంటే ఎందరో అధికారులు చేస్తున్న కృషి అని...ఆ విధంగా కృషి చేస్తున్న అధికారులను ప్రోత్సహిస్తామని, పనిచేయని వారిని బాధ్యతల నుంచి తప్పిస్తాం..ఎవరెవరో ఏవే సిఫార్సులు చేస్తారు..వాటిని వింటాను..అందులో ఏది మంచిది అయితే దానిపై స్వయంగా నిర్ణయం తీసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు.

(216)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ