WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోడెల' ఆధ్వర్యంలో కులాలకతీతంగా 'కార్తీక,వనసమారాధన'...!

గుంటూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల్లో, రాజకీయ నాయకుల్లో అందరికన్నా సీనియర్‌, అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ పడకుండా, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గుంటూరు జిల్లాలో 'కోడెల' అంటే తెలియని వారు లేరనే పరిస్థితికి వచ్చారు. ఆయన ఏ పనిచేసినా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా సత్తెనపల్లి పట్టణం శరభయ్యగ్రౌండ్స్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ కులసమారాధన కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు ఆయన కుమారుడు డాక్టర్‌ కోడెల శివరామ్‌ అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. కుల,మత వర్గాల భావనకు దూరంగా నవసమాజ నిర్మాణమే జీవిత లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిత్యం శ్రమించి అసెంబ్లీ సభాపతి కోడెల ఆధ్వర్యంలో ఆనందంగా ఈ కార్తీక వనమహోత్సవంలో పాల్గొని తామంతా ఒకటే అని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. సుమారు 20సంవత్సరాలకు పైగా కార్తిక వనసమారాధనకు హాజరవుతారని, ఈ కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సత్తెనపల్లిలో ప్రారంభించబోతున్నామని అందుకే అన్ని పనులు తన భుజస్కంథాలపై వేసుకున్నానని కోడెల రాజకీయవారసుడు ఆయన కుమారుడైన డాక్టర్‌ శివరామ్‌ తెలిపారు. ఈ కార్యక్రమం కుల,మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు. తాము ఊహించిన దానికన్నా ఎక్కువమంది ప్రజలు హాజరవుతారని 'శివరామ్‌' తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ అభిమానుల్లో 'కోడెల' అంటే ప్రత్యేకమైన అభిమానం వ్యక్తం అవుతుంది. పెద్దాయన వస్తున్నారు..మనమంతా కుటుంబాలతో కలసిరావలని కార్యకర్తలు రంగంసిద్దం చేసుకుంటున్నారు. సత్తెనపల్లి పట్టణంలో కార్తీకవనసమారాధన కార్యక్రమానికి స్వచ్చంధంగా కార్యకర్తలు ఎవరి ఏర్పాట్లు వారు చేస్తున్నారని, ఇందులో తన వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వహిస్తున్నానని 'శివరామ్‌' చెబుతున్నారు.

(1211)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ