WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కె.ఇ. రాజకీయ వారసులు 'కుమారులే'...!

కర్నూలు జిల్లా మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి కుటుంబంలో రాజకీయంగా భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో తమ్ముళ్లకు మాత్రమే పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తన ఇద్దరు కుమారులను వారసులుగా తీర్చి దిద్దబోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను పోటీ చేసే ప్రసక్తేలేదని, తన కుమారులిద్దరూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆయన సోదరులు ఏ విధంగా స్పందిస్తారు...! వాళ్లు టిడిపిలోనే కొనసాగుతారా..? లేక మరోపార్టీలో చేరతారా...? నిన్నటి వరకు తనతో పాటు తన సోదరులు ఎన్నికల్లో పోటీ చేశారు..ఆయా ఎన్నికల్లో గెలిచాం..ఓడిపోయాం...మంత్రి పదవులు కూడా నిర్వహించాం..తామంతా పక్కకు తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ విషయంలో కె.ఇ. తెలివిగా సోదరులకు ఇతర పనులను చక్కపెడుతూ తన కుమారులను వారసులుగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్దం చేశారు. ఒక తమ్ముడికి ఛైర్మన్‌ పదవి ఇప్పించారు...మరో తమ్మునికి ఆర్థికంగా వేరే విధంగా లబ్దిచేకూర్చారు. తన సోదరులలో ఏ ఒక్కరూ తన నిర్ణయాన్ని వ్యతిరేకించరనే నమ్మకం కె.ఇకి ఉంది. కానీ కె.ఇ కుమారులు ఇప్పటికే అనేక వివాదాల్లో కూరుకుపోయారు. భూ పంచాయితీల్లో వివాదాలు కొనితెచ్చుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో కె.ఇ. కుమారులే కాదు..ఆయన సోదరులు కూడా అదే దారిలో నడిచారని టిడిపి నాయకులు కొందరు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. చివరకు కె.ఇ కుమారులు ఇద్దరు పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాల్లో పోటీ చేయటం ఖాయమని, ఈ విషయంలో పెద్దాయన మాటను సోదరులు కూడా మన్నిస్తారని నమ్మకం తమకు ఉందని కెఇ అనుచరులు చెబుతున్నారు.


(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ