WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డిఆర్‌ఒ నాగబాబుపై ఆరా తీస్తున్న రెవిన్యూ,సిఎంఒ వర్గాలు..!

గుంటూరు డిఆర్‌ఒగా ఐదున్నర సంవత్సరాలుగా 'నాగబాబు' కొనసాగుతున్నారనే విషయాన్ని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన నేపథ్యంలో ఆ కథనాన్ని చదివిన 'రెవిన్యూశాఖాధిపతితోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వివరాలను సేకరిస్తున్నారు. ఇంతకు ముందు ఆర్డీఓ,డిఆర్‌ఒలను బదిలీలు చేసే అధికారం ఆశాఖ మంత్రికి ఉండేది...అప్పట్లో వెంటనే శాఖాధిపతి స్పందించి నిర్ణయాలు వెంటనే తీసుకునేవారు. తాజాగా ఆర్‌డిఒ,డిఆర్‌ఒలు బదిలీల  వ్యవహారాన్ని జిఎడికి అప్పగించారు...అక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయానికి అప్పచెబుతున్నారు. రెవిన్యూశాఖాధిపతి 'నాగబాబు' వ్యవహారంపై ఒక నివేదికను సిఎంఒకు పంపే అవకాశం ఉందనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక అధికారి ఐదున్నరేళ్లు ఒకేచోట పనిచేయటం ఏమిటి...? ఆయన మోనార్క్‌గా తయారు అవరా...? ఆయన వివరాలు సేకరించి, త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.

(432)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ