WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒక కాలు...కోర్టులో...మరోకాలు..రోడ్డుపైనా...!

ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ తన రెండు కాళ్లలో ఒక కాలు కోర్టులో...రెండో కాలును రోడ్డులో పెట్టి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరాల కింద పలు కేసులో నిందితుడిగా ఉంటూ, పాదయాత్ర చేస్తూ ఆయన ఏమి చెబుతారని 'ఆది' ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాశయాలతో ముందుకెళుతున్నారని, త్వరలో నిరుద్యోగుల నిరుద్యోగభృతి ఇవ్వడం కూడా జరుగుతుందని, అటువంటి తమ నేతపై దోపిడీ విధానాలను ఆవలంభించిన 'జగనా' విమర్శించేది అని ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని 'జగన్‌' భావించడాన్ని 'ఆది' తప్పుపట్టారు. ఎక్కడ తన ఎమ్మెల్యేలు పార్టీని వీడి టిడిపిలో చేరతారనే భయంతో అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు ఆయన పిలుపు నివ్వబోతున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం సిబీఐ కోర్టులో కేసులు నడుస్తున్నాయని, త్వరలో ఈడి కూడా ఆయనపై కేసులు దాఖలు చేయబోతుందని, 'జగన్‌' ఆ కేసుల నుంచి బయటపడడం అసాధ్యమన్నారు. ప్రజలు బాగుకోరేవారే నాయకులు అవుతారే తప్ప...ఏసీ గదుల్లో కూర్చుని విమర్శలు చేసేవారు నాయకులుగా ఎదగలేరని, తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రజల వద్దకే వెళుతున్నారని, కోర్టులు చుట్టూ తిరిగేవారు నాయకులు కారని, అటువంటి వారు సిఎంపై విమర్శలు చేయటం చూస్తుంటే ఇదంతా అసూయతోనే అని 'ఆది' విమర్శించారు. 15రోజులు ఊరురూ తిరిగితే 'జగన్‌' పార్టీ అభ్యర్థిని 25వేల ఓట్లతో ఓటర్లు ఓడించారని, పాదయాత్రతో ఆయన జీరో అవుతారని మంత్రి ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీ బహిష్కరణ, పాదయాత్ర అంటూ 'జగన్‌' కొత్త డ్రామాలు ఆడుతున్నారని మంత్రి ఆది తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబును ఎవరూ ఎదుర్కోలేరని 'ఆది' చెప్పారు...!


(212)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ