WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నామా' బూతు పురాణం...!

తెలుగుదేశం పార్టీలో 'రేవంత్‌రెడ్డి' రాజీనామా హాట్‌టాపిక్‌లా మారిన సమయంలోనే మరో బాంబు పేలింది. ఆపార్టీ సీనియర్‌ నాయకుడు,పోలిట్‌బ్యూరో సభ్యుడు 'నామా నాగేశ్వరరావు' ఓ మహిళను దూషించారని, ఆమె నగ్న చిత్రాలను బయటపెడతానని బెదిరించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు 'నామా నాగేశ్వరరావు'పై కేసు నమోదు చేశారు. గత రెండు నెలల నుంచి ఈ మహిళ తనను 'నామా' వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయగా...వారు ఆధారాల కోసం ఇన్నాళ్లు కేసు నమోదు చేయకుండా ఉన్నారు. ఈ రోజు కేసు నమోదు చేసిన విషయం బయటకు వచ్చింది.దాంతోపాటు బాధిత మహిళ కూడా మీడియాకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. తనను 'నామా' వేధిస్తున్నారని, తన నగ్న చిత్రాలను బయటపెడతానని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంలో ఆమె విడుదల చేసిన ఆడియో టేప్‌ సంచలనం సృష్టించింది. ఈ టేప్‌లో 'నామా' పత్రికాభాషలో రాయలేని విధంగా ఆ మహిళను దూషిస్తున్నట్లు ఉంది. 'సుంకర సుజాత' అనే మహిళను ఉద్దేశిస్తూ 'నామా' మాట్లాడిన మాటలు విన్న వారిలో అసహ్యాన్ని పుట్టించేలా ఉన్నాయి. 'నామా'కు బెంగుళూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో అక్రమ సంబంధం ఉందని, ఆమెను వదిలించుకుని తన వద్దకు ఎందుకు వస్తున్నారని సదరు 'సుజాత' ప్రశ్నించడం..దానికి 'నామా' తీవ్ర స్థాయిలో బూతులు లంఖించుకోవడం ఈ టేప్‌లో ఉన్నాయి. 

  'నామా' 'సుంకర సుజాత'లు స్నేహితులని, ఆమె వద్దకు 'నామా' అప్పుడప్పుడు వస్తుంటారని ఆమే చెప్పింది. తన స్నేహితుడైన 'నామా' బెంగుళూరుకు చెందిన ఎమ్మెల్సీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, దీన్ని తాను ప్రశ్నించడంతోనే తనను దూషిస్తూ, బెదిరిస్తున్నారని సదరు మహిళ ఆరోపిస్తోంది. తన భర్త అమెరికాలో ఉంటారని, తాను, నాగేశ్వరరావు స్నేహితులుగా ఉంటున్నామని..ఈ విషయం తన ఇంట్లో వారందరికీ తెలుసనని, చివరకు తన పనిమనుషులూ దీనికి సాక్ష్యమని ఆమె పేర్కొంటున్నారు.తాను బెంగుళూరుకు చెందిన మహిళా ఎమ్మెల్సీ మాట్లాడడమే 'నామా' కోపానికి కారణమని, ఆమెతో మాట్లాడిన సందర్భంగా ఆమెను 'నామా' వివాహం చేసుకున్న విషయం తనకు తెలిసిందని ఆమె చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకే తనను తీవ్రస్థాయిలో దూషిస్తున్నారని 'సుజాత' చెబుతున్నారు.'నాగేశ్వరరావు' స్త్రీలోడుటని, వ్యభిచారని, చివరకు తన కుమార్తెల విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించారని, ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

  కాగా 'నామా నాగేశ్వరరావు' వ్యవహారం తెలుగుదేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఎంతో కామ్‌గోయింగ్‌గా కనిపించే 'నామా' వెనుక ఇంత కథ ఉందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2009ఎన్నికల్లో టిడిపి తరుపున ఖమ్మం నుంచి పార్లమెంట్‌సభ్యుడిగా గెలిచిన 'నామా' టిడిపి అధినేత చంద్రబాబుకు సన్నిహితుడనే పేరుంది. 'నామా' కోసం 'చంద్రబాబు' సీనియర్‌నాయకుడైన 'తుమ్మల నాగేశ్వరరావు'ను వదులుకున్నారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల సమయంలో 'నామా' 'తుమ్మల'లు అసెంబ్లీ సీటు కోసం పోటీ పడి ఇద్దరూ ఒకర్ని ఒకరు ఓడించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. చివరకు 'తుమ్మల' పార్టీ విడిచిపోవడానికి పరోక్షంగా 'నామా' కారణమయ్యారని ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకులు చెబుతుంటారు...! ఇటువంటి వ్యక్తి కోసమా...చంద్రబాబు 'తుమ్మల'ను వదులుకుంది..అని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా..అవి..అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఒకే రోజు 'రేవంత్‌' రూపేణా ఒకదెబ్బ...'నామా' రూపేణా మరో దెబ్బతగిలిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


(606)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ