WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నవగ్రహాలతోనే పోటీ అంటున్న 'రేవంత్‌రెడ్డి'...!

తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి సత్తా చూపేందుకు 'రేవంత్‌రెడ్డి' పథకం ప్రకారం ముందుకు వెళుతున్నారు. తాను నవగ్రహాలతోపోటీ పడబోతున్నానని రేవంత్‌రెడ్డి ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ఆ నవగ్రహాలు ఎవరంటే 'ఈనాడు' రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆయన కుమారుడు కెటిఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు, కుమార్తె కవిత, ఆంధ్రా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, మంత్రి పరిటాల కుటుంబం, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో అని ఆయన చెబుతున్నారు. కోట్లు గడించిన 'కమ్మ'వారు తెలంగాణలో వందల కోట్లు వ్యాపారాలు చేస్తున్న మంత్రి యనమల, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు 'రామోజీరావు', రాధా కృష్ణలకు తన సత్తా చూపిస్తానని 'రేవంత్‌రెడ్డి' చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కెసిఆర్‌కు కానీ ఆయన కుటుంబానికి కానీ ముఖ్యమంత్రి పదవి దక్కాలని 'రామోజీరావు, రాధాకృష్ణల పథకమని ఈ పథకాలకు 'చంద్రబాబు' మనస్ఫూర్తిగా ఇష్టపడడం లేదని 'రేవంత్‌రెడ్డి' చెబుతున్నారు. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సర్వే చేయించి కాంగ్రెస్‌ తరపున విజయం సాధించగలనని తెలుసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ