WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హ్యాట్రిక్‌ వీరుడు 'లక్ష్మీకాంతం'...!

మళ్లీ మూడోసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా హ్యాట్రిక్‌ సాధించింది. హ్యాట్రిక్‌ సాధించడానికి ముఖ్య కారణం జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతమని జిల్లాలో వివిధ విభాగాల్లో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే మూడోసారి అగ్రస్థానం సాధించినందుకు గర్వంగా ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారని వారు చెబుతున్నారు. బహిరంగ మల,మూత్ర రహిత జిల్లాల్లో కృష్ణాకు 95శాతంతో మొదటి స్థానంలో నిలవడం వెనుక కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఉన్నారని, రాజకీయ, అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లా మండల స్థాయి అధికారులు, ప్రత్యేకాధికారులు పల్లెనిద్ర చేయడంతో ఆయా గ్రామాల్లో ఉన్న చాలా సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఈ విధంగా అనేక సమస్యలు పరిష్కరించి 90శాతం విజయవంతం కాగా మిగిలిన జిల్లాలో 28 నుంచి 30శాతం కూడా లేవని ముఖ్యమంత్రి చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌలు రైతులకు 135కోట్ల రూపాయల రుణాన్ని అందించిన ఘనత కూడా కృష్ణా జిల్లాకే దక్కింది. గత నెలలో కౌలు రైతులకు కేవలం రూ.30కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వగా ఈ మాసంలో రూ.105 కోట్లు అదనంగా ఇవ్వడం జరిగిందని, దీనికి కలెక్టర్‌ లక్ష్మీకాంతం కృషే కారణం. 

  నీరు-ప్రగతి కార్యక్రమం ద్వారా లక్ష్యాన్ని మించి...సాధించడం జరిగింది. జాతీయ,గ్రామీణ ఉపాధి పథకం ద్వారా కృష్ణా జిల్లాలో ఏడు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనులు కల్పించారు. ఇది జాతీయ స్థాయిలోనే రికార్డు. ప్రతి నెల 90శాతంపైగా నిత్యావసరాలు పంపిణీ చేయటం,మూడున్నర లక్షల మందికి సకాలంలో ఫించన్లు పంపిణీ చేయటం, అనేక గ్రామాల్లో సిసిరోడ్లు నిర్మాణాలను పూర్తి చేయటం జరిగింది. దాదాపు 120 అంగన్‌వాడీ భవనాలను నిర్మించారు. సుమారు 150 హాస్టల్స్‌, 300పాఠశాలలు, 50 అంగన్‌వాడీల భవనాలను కలెక్టర్‌ మరమ్మత్తులు చేయించారు. మీ కోసం కార్యక్రమాలను ఆడిట్‌ చేయటంతో ప్రజల్లో మంచి పేరు వచ్చింది. గ్రీవెన్స్‌ ద్వారా గతంలో కన్నా ఈ నెలలో ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమపథకాలను గ్రామస్థాయికు చేరుకునే విధంగా కృషి చేయటంలో తనతో పాటు కింది స్థాయి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారని, ఇది తన ఒక్కడి విజయమే కాదని, ఇది సమిష్టి విజయమని కలెక్టర్‌ లక్ష్మీకాంతం చెబుతున్నారు. హ్యాపీఇండెక్స్‌లో మూడోసారి కూడా  అవార్డు దక్కడం,దీనిపై ముఖ్యమంత్రి ప్రశంసించడం తనకెంతో సంతృప్తి లభించిందని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలుపుతూ ఇదే విధంగా అందరం దూకుడుగా వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించి సిఎం చంద్రబాబు దృష్టిలో ఇదే స్థానాన్ని నిలుపుకుని మరింత ముందుకు దూసుకెళదామని 'లక్ష్మీకాంతం' చెప్పారు.

(797)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ