WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దేశం' వైపు 'ప్రసన్న' చూపు...!

మాజీ మంత్రి నల్లపురెడ్డి కుటుంబ రాజకీయ వారసుడు, కోవూరు నియోజకవర్గంలో పట్టున్న నాయకుడైన 'నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి' గతంలో తప్పటడుగులు సరి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు 'ప్రసన్న'ను టిడిపిలో చేర్పించాలనుకుంటున్నారా..? 'ప్రసన్నే' టిడిపిలో చేరాలనుకుంటున్నారా...? అనే విషయంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై 'ప్రసన్న'కు సన్నిహితుడైన మాజీ మంత్రిని 'జనం ప్రత్యేక ప్రతినిధి' సంప్రదించగా ఇంత వరకు ఆయన ఈ విషయంపై పెదవి విప్పలేదని, కానీ ప్రచారం జరుగుతున్న మాట యధార్థమేనని అంగీకరించారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కొందరు నాయకులను 'ప్రసన్న' సంప్రదించారని బయటకు పొక్కింది. ఇదే కాదు...'చంద్రబాబే' ప్రసన్నను పార్టీలో చేర్చుకునేందుకు కబురు చేశారని మరో విధంగా ప్రచారం జరుగుతోంది. 'ప్రసన్న'ను టిడిపిలో చేర్చుకుని కొవూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆయన అవలీలగా గెలుస్తారని 'చంద్రబాబు' చేయించిన సర్వేలో వెల్లడైంది. అంతే కాకుండా వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దూకుడును కట్టడిచేయాలంటే ఆయన సమీప బంధువైన 'ప్రసన్న'ను కూడా పార్టీలో చేర్చుకుంటేనే సాధ్యమవుతుందనేది 'చంద్రబాబు' నమ్మకమట. మంత్రి సోమిరెడ్డి కన్నా 'నల్లపురెడ్డి' కుటుంబ అభిమానులు చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు. వారందరిలో ఎక్కువ మంది 'జగన్‌' పార్టీలో ఉన్నప్పటికీ 'ప్రసన్న' ఎటువెళితే అటు వెళ్లేందుకు వారు సిద్ధం. ఈ విషయం తెలుసుకునేందుకు 'ప్రసన్న'ను సంప్రదించాలని 'జనం ప్రత్యేక ప్రతినిధి' ప్రయత్నించగా ఆయన 'ఫోన్‌'కు అందుబాటులోకి రాలేదు. ఏది ఏమైనా మరి కొద్దిరోజుల్లో 'ప్రసన్న' రాజకీయ పయనమెటో ఆయనే స్పష్టం చేస్తారనేది విశ్వసనీయవర్గాల సమాచారం.

(380)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ