WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న 'రేవంత్‌'...!

నిన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌కు, మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి మింగుడుపడని నాయకుడు. ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బద్దశత్రువు. గతంలో కాంగ్రెస్‌పై ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశారు..అంతకు రెట్టింపుగా కెసిఆర్‌ ఆయన కుటుంబసభ్యులపై చేశారు. ఆయనే తెలంగాణ తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే 'రేవంత్‌రెడ్డి'. ఎవరెవరినీ ఎప్పుడు విమర్శలు చేయాలో..ఆరోపణలు చేయాలో 'రేవంత్‌రెడ్డి'కి ఉన్నంత అనుభవం తెలంగాణ నాయకులకు తక్కువ. ఢిల్లీలో 'రేవంత్‌రెడ్డి' 'రాహుల్‌గాంధీ'ని కలసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు..కొంత మంది సన్నిహితులకు కూడా కప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ఆ ప్రాంతానికి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు 'రేవంత్‌'ను అనుసరిస్తారా..? లేక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా..? ప్రస్తుతం దీనిపై ఏ విధంగా వారి నిర్ణయం ఉంటుందో చెప్పలేమని టిడిపి నాయకుల అభిప్రాయం. ఇప్పటికే కొంత మందినాయకులు, మాజీలు గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు 'రేవంత్‌'కు మద్దతు ఇస్తారా...టిడిపికే మద్దతు ఇస్తారా...? అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీపై ఇప్పటికీ సెటిలర్స్‌ల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండాల్సిన చంద్రబాబు తమను వదిలి అమరావతి వెళ్లారని చాలా మంది కోపగించుకుంటున్నారు. ఏది ఏమైనా కెసిఆర్‌ అనుకూలశక్తులు,వ్యతిరేక శక్తులు పరస్పరం ఎన్నికల్లో తలపడబోయే పరిస్థితిరాబోతోంది. 'రేవంత్‌రెడ్డి'నే ముఖ్యమంత్రిని చేస్తారని 'రాహుల్‌గాంధీ' అభయం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. లేకుంటే 'రేవంత్‌' ఇప్పుడే కాంగ్రెస్‌లో చేరేవారు కారు. ఎక్కడో ఏదో జరిగింది...తనకేదో..మంచి పదవి రానుందనేది 'రేవంత్‌' నమ్మకం. ముందుముందు తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో...?

(238)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ