WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎస్పీ 'అప్పలనాయుడు'పై సిఎంకు ఫిర్యాదు చేయబోతున్న ఎమ్మెల్యేలు...!

గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ అప్పలనాయుడు వ్యవహారశైలిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనం అంతా వాస్తవమేనని, తాము నోరు తెరిస్తే చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందని ఎమ్మెల్యేలు, మంత్రులు తమ సన్నిహితులతో అంటున్నారు. ఎస్పీగా నియమితులైన ఐపిఎస్‌ అధికారులు తమ మాటే చెలామణి కావాలని రాజకీయవర్గాలను, అధికారపార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను పట్టించుకోవద్దనే కోరిక సరైందని కాదని ఈ విషయంలో డీఐజి కూడా ఎస్పీకి మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని, జిల్లా ఎస్పీ వ్యవహారశైలిని సిఎంఒ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాన్ని చదివిన క్రిందిస్థాయి అధికారులు తమ సన్నిహితులతో మాట్లాడుతూ నూటికి నూరుశాతం ఇది నిజమేనని చెప్పారు. గుంటూరు గ్రామీణ ఎస్పీగా 'నాయక్‌' ఉన్నంత కాలం ఎటువంటి వివాదాలు ఆ రెండు వర్గాల మధ్య చోటు చేసుకోలేదు. అప్పలనాయుడు ఎస్పీగా నియమితులైన తరువాతే వివాదాలు వస్తున్నాయి. కరవమంటే కప్పకు కోపం..విడమంటే పాముకు కోపం అన్న పరిస్థితి తమకు ఏర్పడిందని కింది స్థాయి పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను ఆధారాలతో ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకుసిద్ధం అవుతున్నారు. మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ఇదే పరిస్థితి తమ నియోజకవర్గంలో ఎదురైతే విపక్షాల నాయకులు తమ కార్యకర్తలను బెదిరిస్తారని, అప్పుడు తమకు అండగా నిలబడే అధికారులెవరూ పట్టించుకోరు. ఈ విషయంపై తాడోపేడో తేల్చుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు.

(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ