WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు 'గబ్బర్‌సింగ్‌'...!

ఆయన సమర్థుడైన ఐపిఎస్‌ అధికారి. సౌమ్యుడు, మంచివారని ఆ అధికారికి పేరుంది. ప్రతి ఒక్కరికి ముందుగా చెబుతారు..వింటే సరి..లేకపోతే..ఏం చేయాలో అది చేయిస్తారు..ఆ అధికారి ఇటీవల గుంటూరు అర్బన్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఆయన పేరు విజయరావు. ఇటీవల నడిరోడ్డుపై జరిగిన హత్యకు ఎస్పీ తీవ్రంగా స్పందించారు. రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. 'గబ్బర్‌సింగ్‌'సినిమాలో 'పవన్‌కళ్యాణ్‌' నిర్వహించిన అంత్యాక్షరి పాటలను వినిపిస్తూ...రౌడీలందరినీ వళ్లు హూనం అయ్యే విధంగా విరగగొట్టించారు. అరండల్‌పేటలో రౌడీషీటర్‌ వాసు హత్య ఉదంతం సోషల్‌ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. అంతే కాకుండా నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. భూ వివాదాల్లో కలుగ చేసుకుంటున్నారు..అపార్ట్‌మెంట్‌లు నిర్మించుకునే వారిని బెదిరించి లంచాలు అడుగుతున్నారు. వీటిని నిశితంగా గమనించిన ఎస్పీ విజయరావు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ను ఇంతకు ముందు నిర్వహించారు. పద్దతి మార్చుకోవాలంటూ మరోసారి కౌన్సిలింగ్‌లో నచ్చచెప్పారు. సామ,దాన,బేధానాలు పనికిరావు..దండోపాయమే పని చేస్తుందని ఎస్పీ గ్రహించి వారిపై వాటిని ప్రయోగించారు. ఎవరైతే తన మాటను పెడచెవిన పెట్టారో..వారికి ఎటువంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో ఆ విధమైన ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ విషయంలో రాజకీయపార్టీ నాయకులు ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఇంకేముంది..విజయరావు తన పుల్‌పవర్‌ చూపించారు. మళ్లీ గుంటూరు నగరంలో కానీ..అర్బన్‌ పరిధిలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కానీ రౌడీషీటర్లను అనే వారు దౌర్జన్యం చేయకుండా కట్టడి చేశారు. ఆ రౌడీ షీటర్లను ఎక్కడ ఉతికి ఆరేశారో ఇంత వరకు ఎవరికీ తెలియదు. రాజధాని పరిసర ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన వైఖరి అవలంభించక తప్పదని, మెతక వైఖరితో ఎవరూ దారికి రారని, బతిమాలినా, బుచ్చగించినా వినరని తెలుసుకున్న ఎస్పీ విజయరావు అసలైన సిసలైన పోలీసు అధికారి పాత్రను కఠినంగా నిర్వహిస్తూ 'గబ్బర్‌సింగ్‌'లా చెలరేగిపోతున్నారు. గతంలో హైదరాబాద్‌లో 'గబ్బర్‌సింగ్‌' అనే పేరు ఒక పోలీసు అధికారికి ఉండేది. ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు. 'గబ్బర్‌సింగ్‌'లా పేరు తెచ్చుకున్నారు. రౌడీషీటర్లను పరిగెత్తించారు..ఆయన అసలు పేరు కె.ఎస్‌.ఆర్‌.మూర్తి అని తరువాత తెలిసింది. అదే విధంగా 'విజయారావు' పేరు కూడా 'గబ్బర్‌సింగ్‌' ముద్రపడి అసలు పేరు తెరమరుగై చివరకు పోలీసు గబ్బర్‌సింగ్‌ మిగిలిపోతారేమో..!

(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ