లేటెస్ట్

సిడ్నీ షెల్డన్‌ కథలు చెప్పొద్దు కెసిఆర్‌...!

ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన ప్రకటన చేశారు. ఒకేసారి భారీ వర్షాలు కురవడం వెనుక విదేశీకుట్ర ఉందేమోనన్నసందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారతదేశంలో గతంలో లేప్‌ాలో, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ చేశారని, ఇప్పుడు తెలంగాణలోనూ అలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తోన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కుండపోత వర్షాల వెనుక విదేశీశక్తులు ఉన్నారని, వారు దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ క్లౌడ్‌బరస్ట్‌ను సృష్టించి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై నిజానిజాలు బయటకు రావాలని అన్నారు. కాగా ఈ క్లౌడ్‌ బరస్ట్‌పై వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కృత్రిమ పద్దతుల్లో భారీ వర్షాలను సృష్టించడమే క్లౌడ్‌ బరస్ట్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేఘమథనం పేరిట దుర్భిక్షం ఎక్కువగా ఉన్న అనంతపురం జిల్లాలో వర్షాలు కురిపించడానికి ప్రయత్నించారు. అయితే...అప్పట్లో ఈ విధానం పెద్దగా పనిచేయలేదు. ‘చంద్రబాబు’ చేసిన ప్రయత్నాలను అప్పట్లో ప్రతిపక్షం ఎద్దేవా చేసింది. అయితే..ఇప్పుడు అదే విధానంలో తాము అనుకున్నచోట భారీ వర్షాలను విదేశీ శక్తులు కురిపిస్తున్నాయని దీని వెనుక కుట్ర ఉందని కెసిఆర్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


దీనిలో నిజానిజాలు సంగతి ఏమిటో కానీ..ఈ క్లౌడ్‌ బరస్ట్‌పై ప్రముఖ ఆంగ్ల రచయిత సిడ్నీ షెల్డన్‌ ఒక నవల రాశారు. అప్పట్లో ఈ నవల సంచలనం సృష్టించింది. Are You Afraid of the Dark? అనే నవలలో విలన్‌ క్లౌడ్‌ బరస్ట్‌ సృష్టించి వివిధ దేశాల నుంచి లక్షల డాలర్లను సంపాదించాలని భావిస్తాడు. ఈ విధానంలో ఎంతో అనుభవం ఉన్న తన తమ్ముడైన సైంటిస్ట్‌తో క్లౌడ్‌ బరస్ట్‌ను విజయవంతం చేస్తాడు. క్లౌడ్‌ బరస్ట్‌ విజయవంతం కాగానే దాన్ని ఆధారంగా చేసుకుని వివిధ దేశాలను బెదిరించి సొమ్ము చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆ ప్రయత్నంలో విలన్‌ మరణిస్తాడు. ఇది స్థూలం Are You Afraid of the Dark? కథ. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా అదే కథను వినిపిస్తున్నారు. మొత్తం మీద కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అనుకూల, వ్యతిరేక స్పందనలు వ్యక్తం అవుతుండగా కొద్దిగా ఇంగ్లీష్‌ నవలలు చదివేవారు ‘కెసిఆర్‌’ సిడ్నీ షెల్డన్‌ కథలు వినిపిస్తున్నారంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ