WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రెండు పరుగులకే ఆలౌట్‌...!

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు చూశాం..కొన్ని మరుపురాని రికార్డులు...! కొన్ని చెత్త రికార్డులు..! అటువంటి చెత్త రికార్డుల్లో ఇప్పుడో రికార్డును చదవబోతున్నారు. జట్టు జట్టంతా కలసి రెండు పరుగులు మాత్రమే చేసిందో జట్టు...! ఎప్పుడు...? ఎక్కడంటారా..? ఇక్కడే..ఆంధ్రప్రదేశ్‌లో...! గుంటూరులో శుక్రవారం నాడు జరిగిన మహిళల క్రికెట్‌ వన్డేమ్యాచ్‌లో నాగాలాండ్‌కు చెందిన జట్టు కేవలం రెండు పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ రెండు పరుగుల్లో ఒక పరుగు ఎగస్ట్రా. అంటే మొత్తం 11మంది కలిపి చేసింది ఒక్క పరుగే...మిగతా బ్యాటర్స్‌ అందరూ గుండు సున్నాలే చుట్టేశారు.మహిళల అండర్‌ 19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా గుంటూరులోని జెకెసి కళాశాలలో ఈ రోజు కేరళ, నాగాలాండ్‌ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొంది.  17 ఓవర్లపాటు జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్‌ బ్యాటర్స్‌ కనీస పరుగులు చేయలేకపోయారు. వారు కనీసం 40  పరుగులైనా సాధిస్తారని తాము భావించామని, కానీ వారు రెండు పరుగులకే ఆలౌట్‌ అయ్యారని కేరళ కోచ్‌ సుమన్‌శర్మ చెప్పారు. మొత్తం మీద ఈ మ్యాచ్‌ చెత్తరికార్డుతో చరిత్రలోకి ఎక్కింది.


(339)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ