లేటెస్ట్

అక్రమార్కులకు అండగా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ?

ప్రభుత్వ స్థలంలో అక్రమ బోరు, పనిచేయని ప్రభుత్వ బోరు. 

గ్రామస్తులకు త్రాగునీటి కష్టాలు, యధేశ్చగా పొలానికి నీటి వాడకం.

అక్రమంగా ప్రభుత్వ భూమి కబ్జా:చోద్యం చూస్తున్న అధికారులు. 

కడప జిల్లాలోని దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా స్వాధీనం చేసుకున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో గ్రామంలోని కొందరి అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఆ ఫలితంగా గ్రామంలోని త్రాగునీటి బోరుకు అత్యంత స‌మీపంలో వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ స్థలంలో బోరు వేసి యధేశ్చగా నీటిని వాడుకుంటున్నారు. దీంతో ఆ గ్రామంలో త్రాగునీటి బోరుకు నీరు అందక గ్రామస్తులు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈ విష‌యాన్ని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెల్లినా అధికారులు నామమాత్రంగా విచారణ చేసినట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా సదరు బోరు అక్రమార్కులకు గ్రామ సెక్రటరీ నోటీసులు పంపించినా లెక్క చేయకపోవటంతో   గ్రామ సెక్రటరీ మండల తాహశీల్దారుకు విష‌యం వివరించినట్లు తెలిసింది. ఈ విష‌యంపై తాహశీల్దారు సదరు బోరు ఉన్న భూమికి కొలతలు వేయించి ప్రభుత్వ భూమిగా నిర్దారించారు. అనంతరం సదరు బోరుకు సీజ్‌ చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న వ్యక్తులు బోరులోని మోటారును తీసివేసి ఇంటికి చేర్చుకున్నారు. కొద్దిరోజులకు టిడిపి చోటానాయకులైన కొందరితో చర్చలు జరిపి దౌర్జన్యంగా మరలా మోటారును దించుటకు ప్రయత్నించగా ప్రభుత్వ అధికారులు పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. ఓ పోలీసు అధికారి సూచనల మేరకు రాత్రికి రాత్రే రెండు ట్రాక్టర్‌ల సహాయంతో కొందరితో వ్యక్తులు, కత్తులు, వేటకొడవల్లతో బోరుదగ్గరకు వెళ్ళి పక్కా ప్లాన్‌ ప్రకారంగా మోటారును బోరులోకి దింపినట్లు విశ్వాసనీయ సమాచారం. ఈవిషయంలో అధికారులు మాత్రం పూర్తి విచరణ జరుపకుండా ఓవ్యక్తిపై మాత్రమే కేసు నమోదు చేయుటకు దువ్వూరు మండల తాహశీలాదారు పోలీసు స్టేషన్‌కు పిర్యాదు పంపినట్లు తెలిపారు. ఈ విషయం జరిగి వారం రోజులు గడువక ముందే మదిరేపల్లె గ్రామంలోని అక్రమార్కులు చోటానాయకులతో కలిసి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను మదిరేపల్లెకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలోని ప్రజలు వీరి అక్రమాలకు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అండదండలు ఉన్నాయా ? అని బహిరంగానే చెప్పుకుంటున్నారు. ఇటువంటి అక్రమార్కులకు అండగా ఉంటే పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు చెడ్డపేరు వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదిఏమైనప్పటికి సదరు అక్రమార్కులకు అడ్డుకట్ట వేయకుంటే మరిన్ని అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ