లేటెస్ట్

ఎన్టీఆర్ తెలుగుజాతి వెన్నుముకఃబాల‌కృష్ణ‌

ఎన్టీఆర్ తెలుగుజాతి వెన్నుముక అని హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. డాక్ట‌ర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం పేరును మార్చ‌డంపై ఆయ‌న స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్చ‌డానికి..తీసేయ‌డానికి ఎన్టీఆర్ అన్న‌ది ఒక పేరు కాద‌ని, ఆయ‌న పేరు ఒక సంస్కృతి, నాగ‌రిక‌త‌, తెలుగుజాతి వెన్నుముక అని ఆయ‌న పేర్కొన్నారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సిఎంగా ఉన్న‌ప్పుడు ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును తీసివేశార‌ని, ఇప్పుడు ఆయ‌న కుమారుడు వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చుతున్నార‌ని, ఎన్టీఆర్ పేరు మార్చితే ప్ర‌జ‌లు మిమ్మ‌ల‌ను మారుస్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎన్టీఆర్ పెట్టిన భిక్ష‌తో బ‌తుకుతున్న నేతలున్నార‌ని, వారు ఇప్ప‌డు జ‌రుగుతున్న‌దాని ఖండించ‌డం లేద‌ని, ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ